పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై రాబోయే సంక్రాంతికి ఏడాది అవుతోంది. కానీ టాలీవుడ్ సినిమా ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంపాక్ట్ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో పవర్ స్టార్.. పవర్ స్టార్ అని ఫ్యాన్స్ చేసే హంగామా ఇప్పుడు కూడా మరో రకంగా కొనసాగుతోంది. ముఖ్యంగా మెగా ఈవెంట్స్ లో పవన్ నామస్మరణ చేయకపొతే ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు.
కానీ ఇప్పుడు పవన్ పేరుతో పాటు జనసేన 'గ్లాసు' గురించి మాట్లాడితేనే మెగా ఫంక్షన్ సంపూర్ణం అయినట్టు. ఈమధ్య 'వినయ విధేయ రామ' ఈవెంట్లో చిరంజీవి.. రామ్ చరణ్ లతో పాటుగా టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పవన్ ప్రస్తావన తీసుకురావలసి వచ్చింది. ఇక తాజాగా వెంకటేష్ -వరుణ్ తేజ్ ల మల్టిస్టారర్ 'F2' ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ ఫ్యాన్స్ ఉత్సాహం అంతటితో చల్లారలేదు. ఇక వాళ్ళ సంతృప్తిపరచడం కోసం జనసేన గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది.
ఫిలిం ఇండస్ట్రీ నుండి మెగా ఫ్యామిలీలో దాదాపుగా అందరూ హీరోలు జనసేనకు మద్దతుగానే ఉన్నారు. వీరితో పాటుగా పవన్ ను అభిమానించే మరికొందరు హీరోలనుండి కూడా జనసేనకు మద్దతు లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది గానీ ఇవన్నీ జనసేనకు ఎలెక్షన్స్ లో ఎంతమాత్రం ఉపయోగపడతాయో వేచి చూడాలి.
Full View