సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ కమెడియన్ ని చెంపదెబ్బ కొట్టాడనే న్యూస్ రెండు రోజులుగా హల్ చల్ చేస్తోంది. నోటికొచ్చిందల్లా మాట్లాడ్డం, దర్శకుడు బాబీపై అభ్యంతరకరమైన జోక్స్ వేయడంతో.. ఈ సంఘటన జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ కమెడియన్ షకలక శంకర్ అని తెలిసింది. అయితే.. ఇతడిని పవన్ కొట్టలేదని అంటున్నారు.
సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో షకలక శంకర్ చాలా సార్లు నోరు జారాడట. ఎంత వాగుడుకాయ అయినా నోరు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. యూనిట్ లో చాలామందిపై ఈ వర్ధమాన కమెడియన్ బారిన పడ్డవాళ్లే అంటున్నారు. ఇతని మాటలు ఇక భరించలేక చివరకు విషయాన్ని పవన్ దగ్గరకు తీసుకెళ్లారట యూనిట్ వర్గాలు. దీంతో షకలక శంకర్ ని పిలిపించిన పవన్.. 'నోరు - ఒళ్లు దగ్గర పెట్టుకో - ఇలాంటివి మళ్లీ జరగడానికి వీల్లేద'ని వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు.
అలాగే ఇతడిని సెట్స్ నుంచి పంపించేశారన్న మాట కూడా కరెక్ట్ కాదని తెలుస్తోంది. శృతిమించిన ప్రవర్తన కారణంగానే.. షకలక శంకర్ ను గత కొంతకాలంగా అతను పేరు సంపాదించిన టీవీ షో నుంచి కూడా తప్పించారని టాక్ వినిపిస్తోంది.