ఒకవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ తిరిగి కెమెరా ముందుకు రావడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎవరో ఒక్కరు తప్పితే మిగిలిన వారంతా పవన్ రీ ఎంట్రీని స్వాగతించారు. ఈ క్రమంలోనే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి కూడా విశేష స్పందన వచ్చింది. ఇదే ఊపులో తన నెక్స్ట్ ప్రాజెక్టుని కూడా పట్టాలెక్కించేసాడు. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బడా ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే క్రిష్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని భావించారు. అయితే రీసెంటుగా పవన్ కళ్యాణ్ క్రిష్ ని తన ఫార్మ్ హౌజ్ కు పిలిపించుకొని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేయొద్దని సూచించాడట. అంతేకాకుండా ఫస్ట్ ఈ చిత్ర కథని జనాలకి నచ్చేలా మార్చమని ఆదేశించాడట. దీనివల్ల తర్వాత మార్కెట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపాడట. తన అన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'కి జరిగిన తప్పిదం మరలా పునరావృతం కాకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా 'అజ్ఞాతవాసి' పరాజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నటిస్తున్న సినిమాలు కావడంతో వీటి మీద భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఈ చిత్రాలు విజయం సాధించి తమ అభిమాన హీరో తిరిగి పూర్వ వైభవం సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.