పది రోజుల కిందట విడుదలైన ‘అజ్ఞాతవాసి’ ఆడియోకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఫుల్ ఆడియో రిలీజ్ కావడానికంటే ముందే బైటికొచ్చి చూస్తే.. గాలి వాలుగా.. పాటలు సూపర్ హిట్టయ్యాయి. జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. ఆడియోలోని మిగతా పాటలు కూడా ఓకే అనిపించాయి. కానీ వీటిలో పక్కా మాస్ మసాలా సాంగ్ లేని లోటు మాత్రం కనిపించింది. తమిళంలో అనిరుధ్ మంచి మాస్ పాటలెన్నో చేశాడు. అక్కడి స్టార్ హీరోల అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేస్తూ.. పవన్ శైలికి తగ్గ మాస్ పాట చేయలేదన్న అసంతృప్తి అభిమానుల్లో కనిపించింది.
ఐతే ‘కొడకా కోటేశ్వరరావా’ పాటతో ఆ లోటు తీర్చేశాడు అనిరుధ్. మొన్న సాయంత్రం విడుదలైన ఈ పాట ఇన్ స్టంట్ హిట్టయిపోయింది. భలే సరదాగా.. ఉత్సాహంగా సాగిందీ పాట. భాస్కరభట్ల క్యాచీగా ఉండే లిరిక్స్ రాస్తే.. పవన్ తనదైన స్టయిల్లో సరదాగా ఈ పాట పాడాడు. దీంతో ఈ పాట ఒక ఊపు ఊపేస్తోంది. రెండు రోజుల్లోనే ఈ పాటకు దాదాపు 60 లక్షల వ్యూస్.. మూడు లక్షల లైక్స్ రావడం విశేషం. సామాజిక మాధ్యమాల్లో ఈ పాట హల్ చల్ చేస్తోంది. రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక ఈ పాట వచ్చినపుడు థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాలో మంచి టైమింగ్ లో ఈ పాట వస్తే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. మొత్తానికి ఈ పాటతో ‘అజ్ఞాతవాసి’ ఆడియోకు ఒక కంప్లీట్ నెస్ వచ్చిందనే చెప్పాలి.