వరుసగా మూడు మడతెట్టేశావా పవన్??

Update: 2016-10-13 04:30 GMT
అవును ఒకప్పుడంటే తెగ రీమేకులు చేశాడు పవర్ స్టార్. కాని గబ్బర్ సింగ్ సినిమా తరువాత ఈ రీమేకులను పక్కన పెట్టేసి అన్నీ స్ర్టయిట్ సినిమాలే చేస్తాడని అనుకున్నారు అందరూ. మనోడు గంగతో రాంబాబు.. అత్తారింటికి దారేది.. సర్దార్ వంటి స్ర్టయిట్ కథలే చేశాడులే. ఏ రిజల్టు చూసి హర్టయ్యాడో కాని ఇప్పుడు మరోసారి రీమేక్స్ అంటున్నాడు ఈ పవర్ఫుల్ హీరో.

పవన్ కళ్యాణ్‌ ఆల్రెడీ 'వీరమ్' సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఆ న్యూస్ అఫీషియల్ గా చెప్పలేదు కాని.. డాలీ డైరక్షన్లో రూపొందుతున్న 'కాటమరాయుడు' సినిమా అదేననే రూమర్లు స్ర్టాంగుగానే వినిపిస్తున్నాయి. పవన్ లుక్స్ కూడా అచ్చం మాతృకలో అజిత్ ను పోలి ఉండటంతో.. ఈ రాయుడు ఆ సినిమానే చేస్తున్నాడని అనుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు నీసన్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా తమిళ రీమేకేనట. అయితే నీసన్ సొంతంగా తమిళంలో తీసిన 'జిల్లా' సినిమాను రీమేక్ చేస్తున్నారా.. లేకపోతే 'వేదాళమ్' అంటూ నిర్మాత ఏ.ఎం.రత్నం.. శౌర్యం-దరువు ఫేం శివ డైరక్షన్లో తీసిన సినిమాను తెలుగులోకి ఎక్కిస్తున్నాడా.. అనే విషయంపై క్లారిటీ లేదు.

ఇక 'వేదాళం' సినిమాను 'రభస్‌' 'హైపర్' సినిమాలను తీసిన సంతోష్‌ శ్రీనివాస్ డైరక్షన్లో రీమేక్ చేస్తున్నట్లు ఒక టాక్ బయటకొచ్చింది. ఇప్పటివరకు ఎవ్వరూ ఈ సినిమా గురించి చెప్పలేదు కాని.. దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్ మాత్రం ఈ రీమేక్ కోసం నన్ను అడిగారు.. అయితే పవన్ కళ్యాణ్‌ లేకపోతే రవితేజ హీరోగా చేస్తాను అన్నట్లు సెలవిచ్చాడు. ఒకవేళ కాటమరాయుడు కనుక వీరమ్ అయితే.. నీసన్ తీసేది జిల్లా అయితే.. సంతోష్‌ శ్రీనివాస్ వేదాళమ్ తీస్తే.. ఏకంగా పవన్ వరుసగా మూడు రీమేకులు మడతెట్టేసినట్లు. వీటన్నింటికీ మధ్యలో త్రివిక్రమ్ సినిమా కూడా ఉందండోయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News