పవన్ పెప్పర్ లుక్ చూపిస్తాడట

Update: 2016-05-05 13:38 GMT
సినీ తారలు మేకప్ లేనిదే బయటకు రారనే విషయం తెలిసిందే. ఈ విషయంలో చాలాసార్లు హీరోయిన్లను మించి పోతూ ఉంటారు స్టార్ హీరోలు. విగ్గులు - మేకప్ - హెయిర్ డై.. ఇలా సినిమాల్లో కనిపించే ఆన్ స్క్రీన్ లుక్ నే ఆఫ్ స్క్రీన్ లోనూ చూపిస్తూ.. తమ వయసును దాచేసుకుంటూ ఉంటారు. ఎంత ఏజ్ వచ్చినా కుర్రాళ్లలా కనిపించేందుకు ట్రై చేస్తూ ఉంటారు. కానీ  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూట్ మాత్రం విభిన్నం.

సినిమాల్లో తప్ప వీలైనంత వరకూ ఒరిజినల్ లుక్ తోనే కనిపించడం పవన్ స్పెషాలిటీ. ఇఫ్పుడీ లుక్ తోనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఎస్ జే సూర్య డైరెక్షన్ లో చేయనున్న మూవీలో పవన్ పెప్పర్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. నిజానికి ఇదో ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ అని ముందే చెప్పేశారు. రెండేళ్ల క్రితం అజిత్ హీరోగా తమిళ్ లో వీరం అనే మూవీ వచ్చింది. దీన్ని తెలుగులో వీరుడొక్కడే అనే పేరుతో డబ్బింగ్ కూడా చేశారు. ఈ మూవీని స్ఫూర్తిగా తీసుకుని, హీరో కేరక్టరైజేషన్ అలాగే ఉండేలా స్టోరీ సిద్ధం చేశాడట దర్శకుడు.

సాధారణంగా తన రియల్ ఏజ్ కి దగ్గరగా ఉండేలా హాఫ్ వైట్ హెయిర్ తోనే కనిపిస్తాడు అజిత్. ఇప్పుడు పవన్ కూడా సేమ్  స్టైల్ ఫాలో కానున్నాడంటున్నారు. సినిమాలో కూడా తన రియల్ లుక్ నే చూపిస్తూ సినిమా చేయనున్నాడన్నది లేటెస్ట్ టాక్. ఇదే నిజమైతే.. తెలుగులో ఇలా రియల్ లుక్ తో చేసిన తొలి  హీరోగా ట్రెండ్ సెట్ చేస్తాడు పవర్ స్టార్.
Tags:    

Similar News