పిల్లాడిగా ఉన్నపుడే పవన్ పాలిటిక్స్

Update: 2016-04-20 04:19 GMT
మరికొన్ని సినిమాలు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీని వదిలేస్తానని చాలాసార్లే చెప్పాడు. ఫుల్ టైం పొలిటీషియన్ అవతారం ఎత్తుతానని ఓపెన్ గానే ప్రకటించాడు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్.. రాబోయే ఎన్నికల నాటికి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందనున్నాడు.

'మా నాన్న - పెదనాన్నలకు కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. వారు సమాజంలో సమస్యల గురించి మాట్లాడుకోవడం, వేరువేరు ప్రాంతాలు చుట్టి రావడం చేసేవారు. స్కూల్ లో కూడా దేశభక్తి - చరిత్ర పాఠాలు నన్ను అమితంగా ఆకట్టుకునేవి. సినిమాల్లో కూడా చాలా డైలాగ్స్ నే విన్నాను. అలా నేనెందుకు ఉండకూడదనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేది' అంటున్నాడు పవన్ కళ్యాణ్.

కాలేజ్ తర్వాత పాలిటిక్స్ వైపు అడుగులు వేద్దామని అనుకున్నా.. మెగాస్టార్ చిరంజీవి తీసుకొచ్చి సినిమాల్లో ఎంటర్ చేశారట. దీంతో ముందు ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిందట పవన్ కి . అయితే తన ఆలోచనలు, మానసికంగా ఫీలయ్యే ఒత్తిడి ఖచ్చితంగా రాజకీయాల వైపు అడుగులు వేయిస్తుందని తనకు తెలుసన్న పవన్.. తను ఓ సామాన్యుడిని మాత్రమే అని, స్టార్ ని అనే ఫీలింగ్ ఎప్పుడూ లేదని చెప్పాడు.

Tags:    

Similar News