''ఆల్రెడీ మనకు బోలెడన్ని మతాలు ఉన్నాయి. మళ్ళీ కొత్త మతాలు ఎందుకు? ఆల్రెడీ మనకు చాలా ఈజమ్ లు ఉన్నాయి. మళ్ళీ కొత్త ఈజమ్ ఎందుకు? అందుకే నాకు అనిపిస్తుంటుంది అసలు ఈ 'పవనిజం' అనేది ఎందుకు అని'' అంటూ అభిమానులపైనే పెద్ద బాంబ్ వేశాడు పవర్ స్టార్. అయితే దీని తరువాత ఇంకోమాట చెప్పాడు. బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ మాటలన్నీ పలికాడు పవనుడు.
''ఇదంతా కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈ పవనిజం ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కాని..'' అంటూ కాస్త వేదాంత ధోరణిలో ఫినిష్ చేశాడు. మరి మీరు సినిమాల్లోకి వెళ్ళిపోతే ఈ పవనిజం ఏమైపోతుంది? ''ఏమో తెలియదు. వాళ్ళందరూ ఏమవుతారో.. పవనిజం ఏమవుతుందో.. నేను చెప్పలేను'' అంటూ ముగించేశాడు. మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాల్లో యాక్టింగ్ చేయడం కుదరదని.. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లే.. ఇప్పుడు పవన్ కూడా చెబుతున్నాడు. ఏమవుతుందో మరి.
ఇకపోతే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏప్రియల్ 8న విడుదల కానున్న సంగతి తెలిసిందే.