పవన్ కళ్యాణ్ సినిమా అంటే తన ప్రతీ సినిమాలోనూ తనే మెయిన్ అట్రాక్షన్ గా ఉంటాడు. కానీ ప్రతీ మూవీలో ఏదో ఒక పాయింట్ చుట్టూ ఎంటర్టెయిన్ చేయడం పవన్ సినిమాల్లో కనిపించే ట్రేడ్ మార్క్ కామెడీ. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ కాటమరాయుడులో ఓ స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటున్నాడట పవన్.
డాలీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాటమరాయుడులో.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవర్ స్టార్ పక్కాగా రాయలసీమ యాసలోనే డైలాగ్స్ చెబుతాడట. సినిమాలో పవన్ చెప్పే డైలాగులే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సీమ స్లాంగ్ విషయంలో పవన్ చాలా కేర్ తీసుకుంటున్నాడట కూడా. ఇప్పటివరకూ షూటింగ్ పార్ట్ వరకే జరిగినా.. డబ్బింగ్ సమయానికి వచ్చేసరికి కంప్లీట్ గా రాయలసీమ యాసలో మాట్లాడి.. తూటాలు పేల్చనున్నాడట పవన్.
కాటమరాయుడులో అభిమానులకు పవన్ ఇచ్చే ట్రీట్ ఇదే అంటున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత శృతి హాసన్ తో మరోసారి జత కట్టిన పవన్.. కాటమరాయుడు చిత్రాన్ని మార్చ్ చివరలో విడుదల చేయనున్నాడు.