ఎన్నాళ్లో వేచిన ఉదయం రానేవచ్చింది. చిరు - పవన్ ఇద్దరూ కలిశారు.చిరు అరవై వసంతాల వేళ కొణెదల వారింటికి కొత్త సంబరం తీసుకువచ్చాడు పవర్ స్టార్. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవికి పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తరువాత చిరు ఇంటికి వెళ్లిన పవన్ 45 నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో గడిపారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి తన అనుబంధాన్ని చాటాడు.
పవన్-చిరు గ్యాప్ గురించి పుంఖానుపుంకాలుగా వస్తున్న వార్తలకు పవన్ చెక్ పెట్టాడు. రాజకీయ సిద్ధాంతాల పరంగా అన్నతో తనకు కాస్త అభిప్రాయ బేధాలు ఉన్నా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని పవన్ చాటిచెప్పాడు. చిరు -పవన్ చాలా రోజుల తర్వాత కలవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అంతేకాదు ఇవాళ పార్క్ హయత్ హోటల్ లో జరిగే చిరు జన్మదిన వేడుకలకూ హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో చిరు దోశ స్పెషల్ ఎట్రాక్షన్. రజనీ, బిగ్‌బి అమితాబ్ సహా అతిరథమహారధులంతా హాజరుకానున్నారు. మెగాస్టార్ ఇంటికి పవన్ రావడంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. వివిధ జిల్లాలలో అభిమానులు అన్నయ్య బర్త్ డేను వేడుకగా చేసుకుంటున్నారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు.