మొన్న జరిగిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషెస్ కి స్పందిస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ పవన్ ఎప్పుడు లేనిది బర్త్ డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసాడు. ప్రెస్ నోట్స్ ద్వారా ట్వీట్స్ ద్వారా గత మూడు రోజుల నుంచి అందరికి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు. బర్త్ డే నాడు హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయితే.. పవన్ అందరికి రిప్లై ఇస్తున్న క్రమంలో థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. పవన్ రిప్లై కోసం సినీ ప్రముఖుల ఆరాటపడ్డారని చెప్పవచ్చు. పవన్ నుంచి రిప్లై వచ్చిన వెంటనే వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందరూ ట్వీట్స్ చేసారు. అయితే పవన్ పుట్టినరోజు నాడు యాంటీ ఫ్యాన్స్ కావాలనే 'పావలా కళ్యాణ్' అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు. ఇది చూసుకొని చాలామంది అభిమానులు సినీ ప్రముఖులు అదే హ్యాష్ ట్యాగ్ పెట్టి పోస్టులు కూడా పెట్టేశారు. కొందరు తర్వాత తెలుసుకుని వాటిని డిలీట్ చేసి ఫ్రెష్ గా ట్వీట్స్ పెట్టారు.
కాగా, ఇప్పటికే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి.. 'ప్రతి ఏడాది చేసే చాతుర్మాస్య దీక్ష ఈసారి కరోనా మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడాలని భగవంతుడిని ప్రార్థించడానికి చేస్తున్నాను.. ఈ తరుణంలో వచ్చిన నా పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు స్వీకరించడానికి కూడా మనస్సు సన్నద్ధంగా లేదు.. అయినప్పటికీ నా పట్ల ప్రేమానురాగాలు చూపిన వారందరికీ వినయపూర్వక కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మరో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, విలేఖర్లు, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్, వెబ్ మీడియా నిర్వాహకులకు, ప్రత్యేక కథనాల ద్వారా గ్రీటింగ్స్ చెప్పిన పాత్రికేయులకు కృతజ్ఞతలు చెప్పారు జనసేన అధినేత. ''నా సినీ ప్రస్థానం.. మైలురాళ్లను ప్రస్తావిస్తూ వ్యాసాలు కథనాలు రాబోయే చిత్రాల వివరాలను పాఠకులకు వీక్షకులకు తెలియజేసి ఒకసారి నా ప్రయాణాన్ని గుర్తు చేసారు'' అని పవన్ పేర్కొన్నారు. అయితే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. బర్త్ డే వద్దంటూనే మూడు రోజుల నుంచి బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు పవన్ సార్.. రాజకీయాల్లో వెళ్లాక పాలిటిక్స్ బాగానే నేర్చుకున్నారని కామెంట్స్ పెడుతున్నారు.