మొన్ననే ''అత్తారింటికి దారేది'' సినిమా వచ్చి ఇండస్ర్టీ హిట్ కొట్టిందిగా.. ఈ టాక్ మొన్నటివరకు వినడానికి బాగానే ఉండేది. కాని ఎప్పుడైతే ''బాహుబలి'' అండ్ ''శ్రీమంతుడు'' సినిమాలు వచ్చేసి రికార్డుల తుప్పు విదిల్చేశాయో.. అప్పుడు పవన్ సినిమా కాస్త ఔట్ డేటెడ్ అయిపోయింది. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా ''సర్దార్'' ఎప్పుడు వస్తాడా.. రికార్డులు ఎప్పుడు బద్దలు కొడతాడా అని ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే క్లయ్ మ్యాక్స్ పార్టు షూటింగులో ఉన్న సర్దార్.. త్వరలోనే విడుదల కానుంది. ఏప్రియల్ 8న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయిపోతుందని మొన్ననే నిర్మాత శరత్ మరార్ కన్ఫామ్ చేశాడు కూడా. ఈ తరుణంలో ఈ సినిమా గురించి పవన్ కు ఉన్న ఒక అభిప్రాయం ఏంటనేది తెలుస్తోంది. ఈ సినిమా మొదట్లో.. పవన్ ఒక పర్సనలైజ్డ్ కార్డు వేస్తున్నాడట. అదేంటంటే.. ''మూడేళ్ల నుండి నా సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం అంకితం'' అంటూ సినిమాను మొదలుపెడతారట.
ఎప్పుడూ లేనిది కొత్తగా అభిమానులకు సినిమాల అంకితం ఏంటి? ఇంతకుముందు కూడా ఇలా భారీ గ్యాపులు చాలాసార్లు తీసుకున్నాడే!! కొంపతీసి అలా అంకితం ఇచ్చేసి ఇదే లాస్టు సినిమా అంటాడా అనుకుంటే.. మొన్ననేగా ఒక ఇంటర్యూలో చెప్పాడు.. తాను మనుగడ కొనసాగించాలంటే ఇంకొన్ని సినిమాలు చేయక తప్పదని.