ఓవైపు ప్రపంచ యాత్రలు చేస్తూ.. ఇంకోవైపు ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇలాంటి సమయంలో వరుణ్ తేజ్.. సాయిధరమ్ తేజ్ లకు క్లాస్ పీకడమేంటి అంటారా? ఇది ఇప్పటి సంగతి కాదులెండి. కొన్నేళ్ల ముందు వ్యవహారం. వరుణ్.. సాయిధరమ్ చేసిన అల్లరి పనులకు కోపం వచ్చి పవన్ వాళ్లకు ఒక రోజంతా ఫుల్లుగా క్లాస్ పీకాడట. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో రానా నిర్వహించే ‘నం.1 యారీ’ ప్రోగ్రాంలో వరుణ్ వెల్లడించాడు. అసలేం జరిగిందో వరుణ్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
ఒకసారి నా పుట్టిన రోజు సందర్భంగా రాత్రి చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. నేను - సాయిధరమ్ తేజ్.. ఇంకొందరు స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. మా ఇంటి బయటే ఈ పార్టీ జరిగింది. అందరూ కలిసి నానా హంగామా చేస్తారు. ఆ రోజు మామూలు స్థాయి కంటే రచ్చ కొంచెం ఎక్కువే జరిగింది. మా బ్యాచ్ లో ఎవరి పుట్టిన రోజుంటే వాడికి ఆ రోజు మూడినట్లే. కోడి గుడ్లు కొట్టడం లాంటివి ఉంటాయి. నేను.. తేజు ఆరోజు హద్దులు దాటి కొంచెం సైకోలా ప్రవర్తించాం. పెద్ద పెద్దగా శబ్దాలు వస్తుంటే నాన్న కిటికీలోంచి చూసేశారు. వెంటనే కళ్యాణ్ బాబాయ్ కి ఫోన్ చేసే విషయం చెప్పేశారు. బాబాయ్ తర్వాతి రోజే మమ్మల్ని పిలిచి రోజంతా తిట్టారు. బాగా క్లాస్ పీకారు. ఇక నుంచి చిన్న పిల్లల చేష్టలు మానేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. బాబాయ్ తిట్టిన రోజే నా కళ్ళు తెరుచుకున్నాయి’’ అని వరుణ్ తెలిపాడు.