చెర్రీ కోసం అతడ్ని దించుతున్న పవన్‌

Update: 2015-10-21 11:30 GMT
ఇప్పటికే రెండు కథలు విన్నామని.. ఏదో ఒకటి త్వరలోనే ఫైనల్‌ చేస్తామని మొన్న స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించేశాడు. ఇదంతా త్వరలో తాను రామ్‌ చరణ్‌ తో ప్రొడ్యూస్‌ చేయబోయే సినిమా గురించే. అయితే ఈ సినిమా విషయంలో ఒక మేజర్‌ డెసిషన్‌ ఆల్రెడీ తీసేసుకున్నారా అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు.

నిజానికి గబ్బర్‌ సింగ్‌ సినిమాను తీసిన హరీశ్‌ శంకర్‌ కు..  ఆ తరువాత గబ్బర్‌ సింగ్‌ 2 తీయడానికి మాత్రం ఫోన్‌ రాలేదు. ఈ విషయం అప్పట్లో హరీశ్‌ శంకర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమా తీసి హిట్టు కొట్టాక.. చరణ్‌ కు సరిపోయే కథ ఉంటే రెడీ చేసుకొని రమ్మని పవన్‌ క్యాంపు నుండి పిలుపు వచ్చిందట. మాంచి మాస్‌ మసాలా స్టోరీ ఒకటి రెడీ చేసి తీసుకెళితే.. వెంటనే దీనిని చరణ్‌ కు వినిపించుకొని ఓకె చేయించుకో అంటూ పవన్‌ మన హరీశ్‌ కు సెలవిచ్చినట్లు ఒక టాక్‌.

చూస్తుంటే ఇప్పటివరకు సరైన మసాలా హిట్‌ కొట్టని చరణ్‌ కు.. హరీశ్‌ శంకర్‌ వలన అది దక్కుతుందేమో. ఇప్పటికే మనోడు మెగా క్యాంపులో హాట్‌ ఫేవరేట్‌ అయిపోయాడు. గబ్బర్‌ సింగ్‌ కనుక హరీశ్‌ నాతో తీసుంటేనా అంటూ ఆ మధ్యన మెగాస్టార్‌ చిరంజీవి అన్నారంటే.. పైగా 150కు కథ ఉంటే తెచ్చుకో అని కూడా చెప్పారంటే.. అంతకంటే ఇంకేం కావాలి.
Tags:    

Similar News