రామ్ చరణ్ కెరీర్ గురించి మెగా కాంపౌండ్ ఆందోళన చెందుతోందా? అందుకే పవన్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? ఓ విషయంలో అబ్బాయ్ కోసమని త్యాగం చేయాలని కూడా డిసైడ్ అయ్యాడా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది.
మగధీర లాంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చరణ్... ఇటీవల మాత్రం కాస్త వెనకబడిపోయాడు. ఆయన్నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో చిత్రాలు రావడం లేదు. మొన్న వచ్చిన బ్రూస్ లీ అయితే దారుణమైన ఫ్లాప్ టాక్ ని తెచ్చుకొంది. ఇలాంటి మరో ఫ్లాప్ గనుక వస్తే పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రాజకీయంగా చిరుకీ - పవన్ కీ మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ... వ్యక్తిగతంగా మాత్రం చిరును పవన్ ఎంతో గౌరవిస్తారు. చరణ్ విషయంలో చిరు ఎలా ఆలోచిస్తుంటాడో పవన్ కూడా అలాగే ఆలోచిస్తుంటాడు. అందుకే అన్నయ్య చెప్పకముందే తనే చొరవ తీసుకొని చరణ్ కి మంచి కథల్ని ఎంపిక చేసి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడట పవన్. తన సొంత సంస్థలోనే చరణ్ తో ఓ సినిమా నిర్మించాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాడు పవన్. అందుకోసమని కథల్ని సిద్ధం చేయిస్తున్నారు.
అయితే ఇటీవల అనుకోకుండా త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ కి ఓ కథ చెప్పాడట. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకొంటుంటారు. అలా ఇటీవల ఇద్దరి మధ్య ఓ కథ గురించి చర్చలు సాగాయట. ఆ కథ పవన్ కి బాగా నచ్చడంతో `దీన్ని చరణ్ తో తీయండి` అని చెప్పినట్టు తెలిసింది. అందుకు త్రివిక్రమ్ కూడా ఒప్పుకొన్నారట. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి వుంది. అందుకోసమని `కో బలి` అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు. అయితే తన సినిమా కంటే ఇప్పుడు చరణ్ సినిమానే కీలకమని, చరణ్ తోనే సినిమా చేయమని త్రివిక్రమ్ ని పురమాయించాడట పవన్. అబ్బాయ్ కోసమని తన సినిమానే త్యాగం చేశాడన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో చరణ్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తే నిజంగానే ఆ కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది.