ఇండియా అంటే అక్కడి ప్రజలు -పవన్

Update: 2017-11-18 05:40 GMT

ఇవాల్టి రోజుల్లో ఫారిన్ కంట్రీస్ వచ్చి మన దేశంలో వ్యాపారాలు ప్రారంభించడం బాగా ఊపందుకుంది. ఆర్థిక సంస్కరణలు అంటూ కేంద్రం కూడా ఇదే అంశాన్ని తెగ ప్రోత్సహిస్తోంది. మన దేశం నుంచి అనేక మంది ప్రముఖులు ఇతర దేశాలకు వెళ్లి.. ఇక్కడి వ్యాపార అవకాశాలపై బోలెడంత ప్రచారం చేస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయాడు.

ఇటు సినిమా రంగంలో పవర్ స్టార్ గా వెలుగుతున్న పవన్.. అటు రాజకీయాల్లోనూ జనసేన పార్టీకి అధినేతగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ సదస్సు జరగగా.. ఈ కార్యక్రమానికి పవన్ అటెండ్ అయ్యాడు. ఒక సినిమా యాక్టర్.. డైరెక్టర్.. పొలిటీషియన్ గా.. ఇండియాలో ఉన్న అవకాశాలపై తన వ్యూ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ ను కోరగా.. తాను ఇక్కడకు రాజకీయ నేపథ్యాల గురించి.. ఇతర అంశాల గురించి మాట్లాడేందుకు రాలేదంటూ నిక్కచ్చిగా చెప్పేసిన పవన్..  'ఇండియా అంటే అక్కడి ప్రభుత్వం కాదు.. ఇండియా అంటే అక్కడి ప్రజలు. వారి దగ్గర ఉన్న నైపుణ్యం' అంటూ చెప్పిన వైనం ఆకట్టుకుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అజ్ఞాతవాసి ముూవీని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. యూరోప్ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తి కానుండగా.. తిరిగి హైద్రాబాద్ వచ్చాక ప్యాచ్ వర్క్ ఫినిష్ చేస్తారట. వచ్చే నెల ప్రారంభం నుంచి ప్రమోషనల్ వర్క్స్ స్టార్ట్ చేసి.. జనవరి 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Tags:    

Similar News