ఈ హీరోల హాలీడేస్ గురించి మనకు తెలిసే కబుర్లన్నీ.. అయితే చాలా ముందుగా.. లేదంటే చాలా ఆలస్యంగా తెలుస్తుంటాయి. మొన్ననే బన్నీ కాశ్మీర్ వెళ్తున్నాడు అంటూ బోలెడన్ని వార్తలొచ్చాయి. కాని ఇంతలో సింహాచలంలో కనిపించాడు. తీరా వెరిఫై చేస్తే.. మనోడు ఆల్రెడీ వెళ్ళొచ్చేశాడు. ఇక మహేష్ బాబు లండన్ వెళ్తున్నాడా లేడా అంటూ అందరూ ఆలోచిస్తుంటే.. సడన్ గా ఓరోజు ఆయన ఫ్లయిటెక్కేశాడు.
కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ గురించి కూడా అంతే. ఆల్రెడీ రష్యాలో ఉన్నాడని అందరూ అనుకుంటుంటే.. గత రాత్రి ఆయన ఎయిర్ పోర్టులో ఒక్కడే కనిపించాడు. ఓ 10 రోజులపాటు పూణె లో ఉన్నారట. ఆ తరువాత మరి రష్యా వెళ్లాడని అందరూ అనుకున్నా.. ఇప్పుడు ఇంత లేటుగా వెళ్తున్నారేంటో అని చాలామంది సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఇంకొక యాంగిల్ లో చూస్తే.. ఒకవేళ పవన్ తన రష్యా పర్యటన ముగించుకుని ఇండియాలో దిగాక వేరే ఏదైనా ఫ్లయిటు ఎక్కుతున్నాడా అని కూడా అనుకోవచ్చు మనం.
ఇంతకీ పవన్ రష్యా వెళ్తున్నాడా? లేక అక్కడి నుండి వస్తున్నాడా? అది మాత్రం ఎవ్వరికీ తెలియదు.