వరుసగా రెండు సంక్రాంతి పండగలకూ తెలుగు సినిమా కళకళలాడిపోయింది. పోయినేడాది నాలుగు సినిమాలు రిలీజైతే.. ఈసారి మూడు సినిమాలు రేసులో నిలిచాయి. వీటిలో చాలా వరకు మంచి ఫలితాన్నే అందుకున్నాయి. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణల మధ్య మెగావార్ చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కింది. ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల్లో దేని వల్ల దేనికి పంచ్ పడుతుందో అని సందేహాలు వ్యక్తంచేశారు కానీ.. ఈ రెండు సినిమాలూ దేని స్థాయిలో అవి గొప్పగానే ఆడాయి. అంచనాల్ని మించి వసూళ్లు సాధించాయి. బాక్సాఫీస్ ను కళకళలాడించాయి. ఐతే వచ్చే సంక్రాంతికి దీన్ని మించి బాక్సాఫీస్ వార్ చూడబోతున్నాం.
ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుల మధ్య సంక్రాంతి సమరం చూసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ‘స్పైడర్’ తర్వాత మహేష్ లైన్లో పెట్టిన ‘భరత్ అను నేను’ను సంక్రాంతికి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే అనూహ్యంగా పవన్ కొత్త సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. దసరాకు అనుకున్న పవన్-త్రివిక్రమ్ మూవీని సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి సంక్రాంతికి మెగా బాక్సాఫీస్ వార్ చూడబోతున్నట్లే. మామూలుగా అయితే వీళ్లిద్దరూ తలపడేవారు కాదేమో కానీ.. గత రెండు సంక్రాంతి పండగలకూ ఎంత పోటీ ఉన్నప్పటికీ అన్ని సినిమాలూ బాగా ఆడిన నేపథ్యంలో రాజీ పడే అవకాశాలు లేనట్లే. ఐతే ఈ రెండు సినిమాలపై భారీ పెట్టుబడులు పెడుతున్న బయ్యర్లలో మాత్రం గుబులు రేగుతోంది. వీటిలో ఏ సినిమాకు టాక్ వీకైనా దెబ్బ మామూలుగా ఉండదు. కాబట్టి ఈ రెండు సినిమాల్లో దేన్నో ఒకదాన్ని వాయిదా వేయించడానికి బయ్యర్ల మధ్య ఇప్పటికే డిస్కషన్లు మొదలైనట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/