పవన్‌ కోసం మరో 'రిపబ్లిక్‌' రెడీ అవుతుందా?

Update: 2021-10-09 10:32 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ను ఎక్కువగా ఆయన అభిమానులు కమర్షియల్ హీరోగా చూడాలనుకుంటున్నారు. పవన్ నటించిన కమర్షియల్‌ సినిమాలు మినిమం సక్సెస్‌ అయినా కూడా భారీగా వసూళ్లు నమోదు అవుతాయి. యావరేజ్ సినిమాకు వంద కోట్ల వసూళ్లు రాబట్టగల సత్తా ఉన్న హీరో పవన్ కళ్యాణ్‌ అనడంలో సందేహం లేదు. అలాంటి పవన్‌ కళ్యాణ్‌ మంచి సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు చాలా పవర్‌ ఉంటుంది. ఆయన్ను చాలా మంది అభిమానిస్తూ ఆయన సినిమాల్లో మెసేజ్‌ ను రిసీవ్‌ చేసుకుంటూ ఉంటారు. కనుక ఆయన మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తే తప్పకుండా సమాజానికి మంచి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాంటి సినిమా త్వరలో ఒకటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తానం మరియు రిపబ్లిక్‌ వంటి విభిన్నమైన మెసేజ్‌ ఓరియంటెడ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు దేవ కట్టా ఒక మంచి సోషల్‌ మెసేజ్ ఉన్న కథను పవన్‌ కళ్యాణ్‌ కోసం రెడీ చేస్తున్నాడట. ఆ కథ పవన్ కు సరిగ్గా సూట్ అయ్యేలా ఉంటుందని ఆయన అంటున్నాడు. పవన్‌ కు దేవ కట్టా దర్శకత్వం మరియు ఆయన సినిమాలు నచ్చాయి. అందుకే తప్పకుండా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో ఉన్నాడు. కనుక ఆయనకు ఒక మంచి పొలిటికల్‌ మూవీ పడితే రాజకీయంగా కూడా మైలేజ్ వస్తుంది. అందుకే దేవ కట్టా ఆ దిశగా కథను సిద్దం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే చాలా సినిమాలను కమిట్‌ అయ్యి ఉన్నాడు. ఆ సినిమాలు పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. రాజకీయాలు మరియు సినిమాలు రెండు పడవల ప్రయాణం కనుక కాస్త ఎక్కువ సమయం పడుతుంది. పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల లోపు దేవ కట్టా దర్శకత్వంలో సినిమాను చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా పవన్ కు ఉపయోగపడే విధంగా దేవ కట్టా దర్శకత్వంలో సినిమా ఉంటే బాగుంటుందని జనసేన కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. దేవ కట్టా రూపొందిస్తున్న కథ ఇంకా పవన్ వరకు వెళ్లలేదట. అది ఎప్పుడు పవన్‌ వరకు వెళ్లేను.. ఎప్పటికి ఆయన ఓకే చెప్పి సినిమా పట్టాలు ఎక్కేను అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే.




Tags:    

Similar News