ప‌వ‌న్ - రానా మ‌ల్టీస్టార‌ర్.. తెర‌పైకి మ‌రో కొత్త టైటిల్

Update: 2021-02-13 08:30 GMT
మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియం` తెలుగులో రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.

ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌కు మాయావి త్రివిక్ర‌మ్ రీమేక్ స్క్రిప్టు ప‌రంగా సాయం చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. డైలాగ్స్  స‌హా స్క్రీన్ ప్లే ని త్రివిక్ర‌మ్ అందిస్తున్నారు. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ మొదలైంది. ప‌వ‌న్.. రానాల‌పై కీల‌క షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. మ‌ల‌యాళంలో బిజు మీనన్ పోషించిన పాత్ర‌ను తెలుగులో ప‌వ‌న్ పోషిస్తుండ‌గా .. పృథ్వీరాజ్ పాత్ర‌లో రానా న‌టిస్తున్నారు.

అయితే ఈ సినిమా తెలుగు టైటిల్ ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఈలోగానే అభిమానుల్లో ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. బిల్లా రంగా అనే టైటిల్ తో పాటు రుద్ర అనే టైటిల్ కూడా ఇటీవ‌ల ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ ఇవేవీ కాకుండా `రుద్ర ప్ర‌తాప్` అనే టైటిల్ ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఖాయం చేశార‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తామ‌రతంప‌ర‌గా ఈ త‌ర‌హా ప్ర‌చారం సాగుతున్నా.. నిర్మాత‌లు అధికారికంగా టైటిల్ ని ప్ర‌క‌టించాల్సి ఉంది.
Tags:    

Similar News