పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ ల కాంబో గత ఏడాది నుండి కరోనా వల్ల వాయిదా పడుతూనే వస్తుంది. కరోనా మహమ్మారి వచ్చి ఉండకుంటే ఇప్పటి వరకు వీరి కాంబో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఉండేది. కాని ఇప్పుడు మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ గబ్బర్ సింగ్ కాంబో వచ్చే ఆగస్టులో పట్టాలెక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చేస్తున్న హరిహర వీరమల్లు మరియు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీని కూడా పవన్ చేస్తాడట.
హరీష్ శంకర్ కు ఆగస్టు నుండి వరుసగా నెలకు రెండు వారాల చొప్పున డేట్లు ఇవ్వబోతున్నాడట. అలా మొత్తం 60 వర్కింగ్ డేస్ లో షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూడు సినిమా లను కూడా బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయబోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా సాఫీగా సాగిపోయి షూటింగ్ ముగిస్తే సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల చేసేలా దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
పవన్ మరియు హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సెన్షేషనల్ సక్సెస్ గా నిలిచిన కారణంగా ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక మంచి సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ గా సినిమా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ ను ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.