ప‌వ‌న్ - వెంక‌టేష్ మ‌ళ్లీ చేస్తారా?

Update: 2021-12-17 11:32 GMT
ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - విక్ట‌రీ వెంక‌టేష్ మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తారా? .. `ఓ మై గాడ్‌` రీమేక్ లో న‌టించిన ఈ ఇద్ద‌రు ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా రీమేక్ ని చేస్తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. వివ‌రాల్లోకి వెళితే... బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం `ఓ మై గాడ్‌`. త‌న‌ని ప్ర‌శ్నించిన‌ ఓ స‌గ‌టు మ‌నిషికి అండ‌గా నిల‌బ‌డేందుకు ఆ దైవ‌మే భువికి క‌ద‌లి వ‌స్తే.. అత‌నికి తెలియ‌కుండా అండ‌గా నిలిస్తే ఏంట‌న్న క‌థాంశంతో స‌రికొత్త పంథాలో ఆలోచ‌నాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం `ఓ మై గాడ్‌`. అక్ష‌య్ కుమార్ శ్రీ‌కృష్ణుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌రేష్ రావ‌ల్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఇదే చిత్రాన్ని ప్రాంతీయ భాష‌ల్లోనూ రీమేక్ చేశారు.

క‌న్న‌డ‌లో సుదీప్‌, ఉపేంద్ర క‌ల‌సి చేయ‌గా తెలుగులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ... శ్రీ‌కృష్ణుడిగా అక్ష‌య్ కుమార్ పాత్ర‌లో న‌టించ‌గా.. విక్ట‌రీ వెంక‌టేష్ .. ప‌రేష్ రావ‌ల్ పాత్ర‌లో న‌టించారు. `గోపాల గోపాల‌` పేరుతె కిషోర్ కుమార్ పార్ధ‌సాని రూపొందించిన ఈ చిత్రం తెలుగులోనూ అనూహ్య విజ‌యాన్ని సాధించింది. తాజాగా `ఓ మై గాడ్‌` చిత్రానికి సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. 2012లో వ‌చ్చిన `ఓ మై గాడ్‌`లో శ్రీ కృష్ణుడిగా క‌నిపించిన అక్ష‌య్ కుమార్ తాజా సీక్వెల్ లో మాత్రం మ‌హా శివుడిగా క‌నిపించ‌బోతున్నారు.

ఈ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ముంబైలోని బాంద్రాలోని టెర్మ‌న‌స్‌లో జరుగుతోంది. ఈ సంద‌ర్భంగా అక్ష‌య్ గెట‌ప్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. శివుడి త‌ర‌హాలో త‌ల‌పై సిగ క‌నిపిస్తోంది. బైగీ కుర్తా... బ్లూ క‌ల‌ర్ హాఫ్ పైజ‌మా.. కొల్హాపురి చెప్పులు వేసుకుని అక్ష‌య్ క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. అక్ష‌య్ ఫ్యాన్స్ ఈ వీడియోకు శ‌వ స్త్రోత్రం సాంగ్ ని యాడ్ చేయ‌డంతో ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ వీడియోని షేర్ చేసిన అక్ష‌య్ `హ‌ర హ‌ర మ‌హ‌దేవ్ ` అంటూ క్యాప్ష‌న్ ఇవ్వ‌డం విశేషం. ఇదిలా వుంటే ఈ సినిమాని తెలుగులో మ‌ళ్లీ రీమేక్ చేస్తారా? చేస్తే అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ - విక్ట‌రీ వెంక‌టేష్ క‌లిసి న‌టిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News