'ఊసరవెల్లి' హీరోయిన్ పాయల్ ఘోష్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయమని కోరుతోంది. కొన్ని రోజులుగా స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని.. పే ఫర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి చూస్తున్నాడని వార్తలు వచ్చాయి. టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించి 8 భారతీయ భాషల్లో రిలీజ్ చేస్తే కేవలం 5 గంటల్లో 1200 కోట్ల రూపాయలు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉందని భావించిన రాజమౌళి నిర్మాతలతో కలిసి డిజిటల్ రిలీజ్ కి మొగ్గుచూపుతున్నదంటూ పలు ప్రసార మాధ్యమాల్లో న్యూస్ వచ్చింది.
దీనిపై హీరోయిన్ పాయల్ ఘోష్ సోషల్ మీడియా వేదిక స్పందిందించి.. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా డైరెక్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. అయితే 'ఆర్.ఆర్.ఆర్' అద్భుతమైన సినిమా. అలాంటి సినిమాని స్మాల్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయలేము. అందుకే రాజమౌళి సార్ ని 'ఆర్.ఆర్.ఆర్' సినిమా థియేటర్లలో విడుదల చేయగలిగితే అది ప్రేక్షకులకు మరియు అభిమానులకు జీవితకాల అనుభవంగా మిగులుతుందని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో డైరెక్టర్ రాజమౌళి ని ట్యాగ్ చేసి #jnrntr #ramcharan అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టింది. అయితే పాయల్ ట్వీట్ కి ఎన్టీఆర్ - చరణ్ ఫ్యాన్స్ రిప్లై ఇస్తూ ఇలాంటి పుకార్లని నమ్మవద్దని సలహా ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా పాయల్ ఘోష్.. మంచు మనోజ్ - చంద్రశేఖర్ యేలేటి కాంబోలో రూపొందిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' సినిమాలో మెరిసింది. ఇక 'మిస్టర్ రాస్కెల్' అనే సినిమాలో నటిచింది కానీ ఏ సినిమా ఈ భామకు సరైన గుర్తింపును తీసుకురాలేదు. దీంతో అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే అక్కడ కూడా పాయల్ కి పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే పాయల్ ఘోష్ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చిందని చెప్పొచ్చు. ఇటీవల మీరా చోప్రా ఇష్యూలో పాయల్ ఘోష్ ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని గురించి వివరిస్తూ ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.