#MeToo నేను ఉరితాడుకి వేలాడినా అది సూసైడ్ కానే కాదు!

Update: 2020-09-25 05:00 GMT
నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణకు సంబంధించిన వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌ని లైంగికంగా వేధించాడంటూ పాయ‌ల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ వివాదంపై ఆమెకు స‌పోర్ట్ గా నిలిచిన వాళ్లూ వున్నారు. విమ‌ర్శ‌లు గుప్పించిన వాళ్లూ వున్నారు. ఆమెని అన్ని ర‌కాలుగా కార్న‌ర్ చేసిన వాళ్లూ వున్నారు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో పాయ‌ల్ ఘోష్ త‌న‌పై ఆస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తూ త‌న‌ని కార్న‌ర్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అనురాగ్ కశ్యప్ తో తనకు ఎదురైన బాధాకరమైన అనుభవాన్ని ఓ పోర్టల్ ‌తో పంచుకున్నానని.. అయితే త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని భావించిన వారంతా ఆయనకు మద్దతుగా వస్తున్నారని పాయల్ సోషల్ మీడియాలో తన ఫాలోవ‌ర్స్ తో పంచుకున్నారు.

త‌ను ఉరితాడుకు వేలాడుతూ ఉంటే అది ఆత్మహత్య కాదని దేశం తెలుసుకోవాలి. ఇప్పటికే త‌న‌పై  తప్పుడు కథనాలు సృష్టిస్తున్నార‌ని పాయ‌ల్ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. పాయ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన త‌రువాత అంతా త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని భావించింది. కానీ సీన్ రివ‌ర్స్ గా మారి బాలీవుడ్ ‌లో చాలా మంది పాయ‌ల్ ని కార్న‌ర్ చేయ‌డం మొద‌లుపెట్టారు. అనురాగ్ మాజీ భార్య‌లు కూడా అత‌నికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న ఆరోప‌ణ‌ల‌తో మ‌ళ్లీ మీటూ ఉద్య‌మం ఓ ఓవ్ లా మొద‌ల‌వుతుంద‌ని భావించింది కానీ అలాంటిది ఏమీ జ‌ర‌గ‌డం లేదు. అనురాగ్ పై లైంగిక వేధింపుల కేసుని ఫైల్ చేసిన పాయ‌ల్ అక్క‌డైనా క‌ద‌లిక వ‌స్తుందేమోన‌ని ఎదురుచూస్తోంది.
Tags:    

Similar News