‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ మొదటి సినిమాతోనే మంచి స్టార్ డంను దక్కించుకుంది. మొదటి సినిమాలో అందంతో పాటు, నటనతో కూడా మెప్పించిన పాయల్ కు పలు ఆఫర్లు వచ్చాయి. అయితే అవన్ని కూడా చిన్న చిత్రాలే అవ్వడంతో పాటు - నటనకు ప్రాముఖ్యత లేకుండా - కేవలం స్కిన్ షో కే పరిమితం అయ్యే పాత్రలు అవ్వడం వల్ల వాటికి నో చెప్పింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ తాజాగా రవితేజ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
మొదటి సినిమా విడుదలై చాలా నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఈమె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి మాత్రమే ఓకే చెప్పింది. ఆ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది. వచ్చిన ఆఫర్లు తిరష్కరించిన పాయల్ తాజాగా రవితేజ మూవీలో ఎంపిక కావడంతో మంచి బ్రేక్ దక్కినట్లయ్యింది. తెలుగులో పాయల్ కు ఇదో పెద్ద బ్రేక్ అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రవితేజ - వీఐ ఆనంద్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంలో ఇప్పటికే నభా నటేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. తాజాగా మరో హీరోయిన్ గా పాయల్ ను ఎంపిక చేశారు. డిస్కో రాజా అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రం సక్సెస్ అయితే పాయల్ కెరీర్ టర్న్ అయినట్లే. ఇన్నాళ్లు వేచి చూసినందుకు మంచి ఆఫర్ ను పట్టిన పాయల్ - దాన్ని సద్వినియోగం చేసుకుని మరో అడుగు ముందుకు వేస్తుందా అనేది చూడాలి.