అందాల బాంబ్‌ ఈ అమ్మడు

Update: 2022-02-04 05:30 GMT
ఆర్ఎక్స్ 100 సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌ అనూహ్యంగా మొదటి సినిమా తోనే అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించి కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకుంది. ఏ హీరోయిన్ కు అయినా మొదటి సినిమా కమర్షియల్‌ గా సక్సెస్ అయితే అదృష్టం కలిసి వచ్చినట్లే.

పాయల్‌ రాజ్‌ పూత్‌ కు కూడా అదృష్టం కలిసి వచ్చింది. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. కాని స్టార్‌ హీరోల సినిమాల్లో ఈ అమ్మడికి అవకాశాలు దక్కలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ లో ముందుకు సాగుతున్న ఈ అమ్మడు ఖచ్చితంగా ముందు ముందు టాప్‌ హీరోయిన్ అవుతుందని అభిమానులతో అనిపించుకుంటూ ఉంది.

పాయల్‌ రాజ్ పూత్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో కంటే సోషల్‌ మీడియాలో షేర్ చేసే హాట్‌ ఫొటోలతో ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. భిన్న విభిన్నమైన ఫొటో షూట్స్ ను ఈ అమ్మడు షేర్‌ చేస్తూ ఫాలోవర్స్ కు మరియు నెటిజన్స్ కు కన్నుల విందు చేస్తుంది.

ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్‌ మీడియాలో పీక్స్‌ కు చేరింది. సినిమాలతో పోల్చితే ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా ఉంటుంది అంటూ వినిపిస్తున్న కామెంట్స్ లో అనుమానం ఏమీ లేదు. పాయల్‌ రాజ్ పూత్‌ తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటోలు మరోసారి ఆమె ను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యేలా చేసింది అనడంలో సందేహం లేదు.

రెడ్‌ స్కర్ట్‌ మరియు బ్లాక్‌ టాప్ తో లైట్ల వెలుతురులో మెరిసి పోతూ స్కిన్‌ ను అద్బుతమైన బంగారు వర్ణంలో చూపించి సెక్సీ పోజులను ఇచ్చి ఫొటో షూట్‌ చేసింది. అందాల ఐటెం బాంబ్‌ ఈ అమ్మడు అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోయన్‌ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో కూడా ఈఅమ్మడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని హాట్‌ అండ్ రొమాంటిక్ పాత్రల్లో కనిపించాలని అభిమానులు ఆశ పడుతున్నారు. పెద్ద ఎత్తున పాయల్‌ రాజ్ పూత్‌ అందాల వింధుతో ప్రస్తుతానికి అభిమానులను ఎంటర్‌ టైన్ చేస్తుంది.
Tags:    

Similar News