'ఆర్ ఎక్స్ 100`సినిమాలో తన అందచందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించిన పాయల్ రాజ్ పుత్.....ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తమ డెబ్యూ మూవీస్‌తోనే విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న సమంత - రష్మికల సరసన చేరిన పాయల్....కొన్నాళ్ల పాటు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. `ఆర్ఎక్స్ 100`లో పాయల్ గ్లామర్ షోతో ఈ అమ్మడుకు వరుస చాన్స్ లు తలుపుతట్టాయి. అయితే, తనకు వచ్చిన క్రేజ్ ను పాయల్ సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయిందని చెప్పొచ్చు. `ఆర్ ఎక్స్ 100` తర్వాత పాయల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఒక్కటీ లేదు. `ఆర్ డీఎక్స్ 100`అంటూ సోలో ఎంట్రీ ఇచ్చి మెప్పించలేకపోయిన పాయల్...తాజాగా మరోసారి సోలో పెర్ ఫార్మెన్స్ కు రెడీ అవుతుండడం విశేషం.
`ఆర్ ఎక్స్ 100`తర్వాత తన హాట్ ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు `సీత`లో ఐటం సాంగ్ చేసింది పాయల్. బుల్లెట్ మీదొచ్చె బాల్ రెడ్డి....అంటూ పాయల్ వేసిన చిందులు కుర్రకారును ఆకట్టుకున్నా....పాయల్‌కు ఆశించినంత పేరు రాలేదు. ఇక, దాని తర్వాత `ఆర్ డీఎక్స్ 100`తో లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ చేయబోయి...చేతులు కాల్చుకుంది పాయల్. ఇక, వెంకీమామ హిట్ అయినా కూడా....ఆ సినిమాలో పాయల్ రోల్‌కు పెద్ద ఇంపార్టెన్స్ లేకపోవడంతో పెద్దగా పాయల్ పేరు వినిపించలేదు.
ఇక, మాస్ మహారాజ రవితేజతో `డిస్కో రాజా`లో నటించిన పాయల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ సినిమాలలో పాయల్ రోల్..సైడ్ క్యారెక్టర్ లా ఉందని టాక్ వచ్చింది.
ఇక, పాత కమిట్ మెంట్ కోసమో...లేక డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దామనే ఉద్దేశంతోనో ...పాయల్ మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీతో సోలోగా రాబోతోంది. ప్రాణదీప్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న క్రైమ్ మిస్టరీలో ఓ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ తరహా రోల్స్ లో నటించిన కొందరు హీరోలు చేతులు కాల్చుకున్నారు కూడా. అటువంటిది....ఇప్పటికే ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోన్న పాయల్ ఈ జానర్ ను టచ్ చేయడం సాహసమే అని చెప్పవచ్చు. మరోసారి సింహం సింగిల్ టైపులో....హీరో లేకుండా సింగిల్ గా వస్తోన్న పాయల్ ను ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఏదేమైనా...పాయల్ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇది లాస్ట్ చాన్స్ కావచ్చు. పోయిన చోటే వెతుక్కోవాలంటోన్న పాయల్....సోలో పెర్ఫార్మన్స్తో పాయల్ హిట్ కొడుతుందో...ఫట్ అంటుందో వేచి చూడాలి.