ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు గుండెల్ని కోసేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ మూవీతోనే రచ్చరంబోలా చేసేసిన ఈ సోయగం.. యూత్ ను ఫుల్లుగా అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియాలో మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉండడమే ఇందుకు నిదర్శనం.
అయితే.. తొలి సినిమాతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయిందీ బ్యూటీ. ‘డిస్కో రాజా’, ‘వెంకీ మామ’ వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆశించిన సక్సెస్ రాలేదు. ఇంతలోనే కరోనా వచ్చి పడింది. అప్పటికే సన్నగిల్లిన అవకాశాలను కొవిడ్ మరింత పలుచన చేసిందనే చెప్పాలి.
కాగా.. కొవిడ్ మహమ్మారి పాయల్ ఇంట్లో కూడా విషాదాన్ని నింపింది. తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి కరోనాతో ఈ మధ్య మృతిచెందారు. దీంతో.. పాయల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తరన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తాను ఎంతగానో ప్రేమించే ఆంటీ లేకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ క్రమంలో పాయల్ ఆలోచనల్లో విపరీతమైన మార్పు రావడం గమనార్హం. కరోనాను కల్కితో పోల్చిన ఈ బ్యూటీ.. కలియుగం అంతమైపోయిందని, సత్యయుగం మళ్లీ వచ్చేసిందని వేదాంతం వల్లిస్తుండడం విశేషం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్టు పెట్టింది. అందులో.. సత్యకాలం వచ్చేసిందని తాను చెప్పడానికి గల కారణాలేంటో కూడా వివరించింది. అవి ఏంటంటే..?
‘‘ఆదివారం వచ్చిందన్న ఆనందం లేదు, సోమవారం ఉదయం అనే టెన్షన్ లేదు, డబ్బు సంపాదించాలనే దురాశలేదు. ఖర్చు చేయాలనే కోరికలేదు. రెస్టారెంట్ లో తినడానికి ఉత్సాహం లేదు. జర్నీపై ఫీలింగ్ లేదు, బంగారం, వెండిపై మోజులేదు, ఇంక్రిమెంట్ మీద ధ్యాసలేదు, కొత్త దుస్తులపై ఆసక్తి లేదు, చదువు గురించి టెన్షన్ లేదు.. సత్యయుగం వచ్చిందని చెప్పడానికి ఇంతకన్నా ఏం రుజువులు కావాలి?’’ అంటూ రాసుకొచ్చింది పాయల్. అంతేకాదు.. కల్కి అవతారం కొరోనాయేనా? అని సందేహం వ్యక్తం చేసింది. మొత్తానికి తనలోని వేదాంత ధోరణిని బాగానే చూపించింది పాయల్.