ఈ మధ్య కాలంలో వస్తున్న తెలుగు సినిమాలలో.. ట్రైలర్ తో ఆకట్టుకున్న సినిమా అంటే అది ''పెళ్ళి చూపులు'' అనే చెప్పాలి. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను స్వయంగా సురేష్ బాబు ఈ నెల 29న రాష్ట్రమంతా విడుదల చేస్తున్నారు. ఒక ప్రక్కన సురేష్ బాబు మీడియా వాళ్లందరికీ ముందే స్ర్కీనింగ్ వేసి చూపిస్తా అంటుంటే.. ఆయన కాన్ఫిడెన్సు కాస్త ఎక్కువైందేమో అనుకున్నారు కాని.. నిజంగా ఈ సినిమా చూస్తే మాత్రం ఆయన ఎక్సపెక్టేషన్ కరక్టే అనుకోవాలట.
గత రాత్రి హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లోని ప్రివ్యూ ధియేటర్లో వివిధ వర్గాలకు చెందిన చాలామందికి ఈ సినిమాను స్పెషల్ గా చూపించారట. స్ర్కీనింగ్ చూసిన వారందరూ సినిమా మొదటి హాఫ్ అయితే కామెడీతో టాపు లేచిపోయిందని.. అలాగే రెండో హాఫ్ లో ఎమోషన్లు అదిరిపోయాయ్ అంటున్నారు. ఓవరాల్ గా సినిమాలోని యూత్ కెరియర్ కు సంబంధించి పెద్దాళ్లు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనే పాయింటుతో దుమ్ములేపేశారని తెలుస్తోంది. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో చిన్న పాత్రను ఆకట్టుకున్న విజయ్.. ఈ సినిమాలో విజృంభించాడట. అలాగే కమెడియన్ గా నటించిన ఇద్దరు కుర్రాళ్ళు కూడా దున్నేశారని తెలుస్తోంది. సోల్ ఫుల్ మ్యూజిక్ కూడా ఒక ఎస్సెట్ అని టాక్ వినిపిస్తోంది.
చూస్తుంటే.. గతంలో ''దృశ్యం'' సినిమాను ఎలాగైతే ఒక డజను ప్రివ్యూ షోలు వేసి అందరి ఫీడ్ బ్యాక్ తీసుకుని సరైన టైములో సినిమాను రిలీజ్ చేసి హిట్టు కొట్టారో.. ఇప్పుడు కూడా సేమ్ అదే ఫీట్ సురేష్ బాబు రిపీట్ చేస్తారేమో అనిపిస్తోంది. చూద్దాం మరి. ఒక ప్రక్కన కబాలి ఫీవర్ తో ఈ వారమంతా అదిరిపోతుంది. ఆ తరువాత వచ్చే సినిమా యూత్ ఫుల్ అండ్ రిఫ్రెషింగ్ గా ఉంటే మాత్రం.. కుర్రకారు చూడకుండా ఉంటారేంటి!!