శ్రీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ముందుగా 'పెళ్లిసందడి' కనిపిస్తుంది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996లో విడుదలై, యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా విజయంలో కీరవాణి సంగీతం ముఖ్యమైన పాత్రను పోషించింది .. మ్యూజికల్ హిట్ గా నిలబెట్టింది. ఈ ప్ర్రేమకథా చిత్రం ఇటీవలే 25 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలోనే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లి సందD' ప్రాజెక్టును ప్రకటించారు.
'నిర్మలా కాన్వెంట్' సినిమాలో టీనేజ్ హీరోగా పరిచయమైన రోషన్, ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని పూర్తిస్థాయి హీరోగా ఈ సినిమాతో రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమాతో 'శ్రీలీల' కథానాయికగా పరిచయం కానుంది. గౌరీ రోనంకి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నాడు. ఈ సినిమాకి కూడా కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉండటం విశేషం.
మాధవి కోవెలమూడి .. శోభు యార్లగడ్డ .. ప్రసాద్ దేవినేని ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాఘవేంద్రరావు .. కీరవాణి కాంబినేషన్, హీరోగా శ్రీకాంత్ తనయుడు కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తండ్రికి హిట్ ఇచ్చిన టైటిల్ .. కొడుక్కి కూడా హిట్ ఇస్తుందా? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఆశించిన స్థాయిలో అప్ డేట్స్ లేవు. దాంతో ఈ ప్రాజెక్టు పై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. మరి వాళ్ల సందేహాలకు తెరదించుతూ, మేకర్స్ ఏదైనా అప్ డేట్ వదుల్తారేమో చూడాలి.