మూవీ రివ్యూ : ‘పెన్సిల్’
నటీనటులు: జి.వి.ప్రకాష్ కుమార్ - శ్రీదివ్య - షరీఖ్ హసన్ - అభిషేక్ - ఊర్వశి - వీటీవీ గణేష్ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: గోపీ అమర్ నాథ్
నిర్మాత: హరి
రచన-దర్శకత్వం: మణి నాగరాజ్
టీనేజ్ లోనే సంగీత దర్శకుడిగా తన ప్రతిభ చాటుకుని.. తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన జి.వి.ప్రకాష్ కుమార్ గత ఏడాది నటనలోకి కూడా అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండు సినిమాలతో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న జి.వి. ఇప్పుడు ‘పెన్సిల్’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. శ్రీదివ్య కథానాయికగా నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. టైటిల్.. ప్రోమోస్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
శివ (జి.వి.ప్రకాష్ కుమార్).. మాయ (శ్రీదివ్య).. స్కూల్లో 12వ తరగతి చదివే స్టూడెంట్స్. వీళ్ల క్లాస్ మేట్ అయిన నితిన్ (షరీఖ్ హసన్) ఓ సినిమా హీరో కొడుకు. నితిన్ కు అమ్మాయిల్ని వశపరుచుకుని వాళ్లను బ్లాక్ మెయిల్ చేయడం అలవాటు. టీచర్లను కూడా బ్లాక్ మెయిల్ చేసే నితిన్ కు స్కూల్లో చాలామందితో శత్రుత్వం ఉంటుంది. శివ.. మాయలకు కూడా అతనంటే పడదు. ఐతే నితిన్ తో తాడోపేడో తేల్చుకోవడానికి శివ అతడి వెంట క్లాస్ రూంలోకి వెళ్తే అక్కడతను శవమై కనిపిస్తాడు. వీళ్లిద్దరి వెనకే వెళ్లిన మాయ.. ముందు నితిన్ ను శివే హత్య చేశాడనుకుంటుంది. కానీ తర్వాత ఎవరో నితిన్ ను హత్య చేశారని అర్థం చేసుకుంటుంది. ఇక శివ-మాయ ఇద్దరూ కలిసి నితిన్ హత్య గురించి అందరికీ తెలిసేలోపు హంతకుడిని ఎలా పట్టుకున్నారన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
‘పెన్సిల్’ కథ వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది కానీ.. తెర మీద చూసేటపుడు అంత మంచి ఫీలింగేమీ ఇవ్వదు. మర్డర్ మిస్టరీల్లో ఉండాల్సిన టెంపో మిస్సవడమే దీనికి కారణం. ‘ఫోర్త్ పీరియడ్ మిస్టరీ’ అనే కొరియన్ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన కొత్త దర్శకుడు మణి నాగరాజ్.. ఇండియన్ నేటివిటీకి తగ్గట్లు సినిమాను మార్చే ప్రయత్నంలో ఒరిజనల్ ను చెడగొట్టాడు. మర్డర్ మిస్టరీల్లో ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ.. ఉత్కంఠ రేకెత్తించడం. అదే ఇందులో లేదు. వేసే చిక్కుముడులు కానీ.. వాటిని విప్పే విధానం కానీ.. ఆసక్తి రేకెత్తించాలి. ఐతే ముడి వేయడం వరకు ఓకే కానీ.. ఆ ముడుల్ని విప్పే క్రమంలో కథనం ఆసక్తికరంగా సాగలేదు.
మిస్టరీని మిస్టరీగా నడిపించకుండా మధ్యలో కామెడీ టచ్ ఇవ్వడం.. ఇన్వెస్టిగేషన్ వ్యవహారాన్ని చాలా తాపీగా నడిపించడంతో ప్రేక్షకులు కథనంతో పాటు సాగరు. కథనంలో పట్టులేకపోవడంతో.. అనవసర సన్నివేశాలు వచ్చిపోతుండటంతో డీవియేట్ అవుతారు. పన్నెండో తరగతి చదవే హీరో హీరోయిన్లు పక్కన శవాన్ని పెట్టుకుని.. తాపీగా మాట్లాడుకునే తీరు చూస్తే చిత్రంగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు కొంత ఉత్కంఠ రేకెత్తించినా.. అంతలోనే ప్రిన్సిపాల్ క్యారెక్టర్ చేసే కామెడీతో సీరియస్ నెస్ అంతా పోతుంది. మిస్టరీని ఛేదించే ఎపిసోడ్ మధ్య మధ్యలో ఈ కామెడీ ట్రాక్ పెట్టాలన్న ఆలోచన దర్శకుడికి ఎందుకొచ్చిందో ఏమో. మొత్తంగా ప్లాట్ వరకు బాగానే బాగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే పేలవంగా ఉండటంతో ‘పెన్సిల్’ ప్రేక్షకుల్ని చాలా వరకు అసహనానికే గురి చేస్తుంది.
సినిమాను మొదలుపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. నేరుగా మర్డర్ చూపించి.. దీని వెనుక కథను మొదలుపెట్టడం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ తర్వాత వచ్చే హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ మాత్రం విసుగెత్తిస్తుంది. ఐతే హత్యకు గురయ్యే బ్యాడ్ బాయ్ పాత్ర పోషించిన కుర్రాడి పాత్ర తెరమీద కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతాడు. ఆ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్ని దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. ప్రథమార్ధానికి ప్రధాన బలం ఆ కుర్రాడి పాత్రే. ఐతే మధ్యలో ఆ పాత్రను ముగించేయడం నిరాశ కలిగించేదే. ఇంటర్వెల్ బ్లాక్ బాగున్నా.. ఆ తర్వాత ద్వితీయార్ధంలో మర్డర్ మిస్టరీని ఛేదించే ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులు ఆశించినట్లు ఉత్కంఠభరితంగా సాగదు.
హత్య విషయంలో అనుమానితుల జాబితా చాలా పెద్దదే కానీ.. వాటిలో చాలా వరకు డమ్మీ క్యారెక్టర్లే. నిజంగా అనుమానం కలిగించేది శ్రీధర్ అనే టీచర్ పాత్ర మాత్రమే. ఐతే ఇలాంటి మిస్టరీల్లో ఎవ్వరూ ఊహించని వ్యక్తే హంతుకుడు అయి ఉంటాడన్న సంగతి ఈజీగానే గ్రహించేయొచ్చు కాబట్టి.. చివర్లో వచ్చే ట్విస్టు మరీ సెన్సేషనల్ గా ఏమీ అనిపించదు. హంతకుడు ఆ కుర్రాడిని చంపడానికి చెప్పిన కారణం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. నిజానికి ఆ కారణానికి.. స్కూల్ యాజమాన్యానికి ఏం సంబంధం ఉండదు. చివర్లో ప్రైవేట్ స్కూళ్ల గురించి ఆ పాత్ర దంచే లెక్చర్ అంతా వృథా ప్రయాసే. మర్డర్ మిస్టరీలో ఈ సందేశాలేంటో అన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకుడికి. ఓవరాల్ గా ‘పెన్సిల్’ ప్లాట్ పరంగా బాగున్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్లో ఫెయిలై ఓ మామూలు సినిమాలా ముగుస్తుంది.
నటీనటులు:
జి.వి.ప్రకాష్ కుమార్ మంచి సంగీత దర్శకుడే కానీ.. మంచి నటుడు మాత్రం కాదు. ఇప్పటికే రెండు సినిమాలు చేసినా.. ఇంకా నటనలో ఓనమాలు నేర్చుకుంటున్నవాడిలా నటించాడు. పేలవమైన హావభావాలతో క్లూలెస్ గా కనిపించాడు తెరమీద. పైగా అతడి పాత్ర కూడా డమ్మీ అయిపోవడంతో మరింతగా తేలిపోయాడు. శ్రీదివ్య జి.వి.ని బాగా డామినేట్ చేసింది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఐతే ఆమె కంటే కూడా నెగెటివ్ రోల్ చేసిన కొత్త నటుడు షరీఖ్ హసన్ ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. అతనే ఈ సినిమాకు ప్రధాన బలం. హంతకుడి పాత్ర పోషించిన అభిషేక్ బాగా చేశాడు. మిగతా వాళ్లందరూ మన ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండేవాళ్లు కాదు.
సాంకేతిక వర్గం:
జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ సోసోగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ.. పాటలు పెద్దగా రిజిస్టరవ్వవు. ఫారిన్లో వచ్చే మెలోడీ ఒక్కటి బాగుంది. గోపీ అమర్ నాథ్ ఛాయాగ్రహణం ఓకే. సినిమా అంతా దాదాపు ఒకే లొకేషన్లో సాగినప్పటికీ.. సన్నివేశాలు మరీ రిపిటీటివ్ గా అనిపించకుండా తన కెమెరా పనితనంతో చాలా వరకు బాగానే మేనేజ్ చేశాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు. డబ్బింగ్ ఓకే. డెబ్యూ డైరెక్టర్ మణి నాగరాజ్ తనదైన ముద్రను వేయలేకపోయాడు. మర్డర్ మిస్టరీ సినిమాలకు అవసరమైన పకడ్బందీ కథనాన్ని రాసుకోవడంలో అతను పట్టు చూపించలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్ని బాగానే డీల్ చేసినా.. మొత్తంగా ఈ జానర్ మీద అతను పట్టు చూపించలేకపోయాడు.
చివరగా: ఈ పెన్సిల్ మెరుపులు.. పైపైనే!
రేటింగ్-2.5/5