ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు పెటా రేవెట్టేసింది

Update: 2015-07-22 07:21 GMT
మాంసం దుకాణాల్లో తప్ప వేరే ఎక్కడైనా మూగ ప్రాణుల్ని (మేకల్ని, గొర్రెల్ని) చంపితే అది చట్ట ప్రకారం నేరం. ఐపీసీ సెక్షన్‌ 429 కింద అరెస్ట్‌ చేయాల్సిందే. అది హీరోగారి అభిమాని అయినా, ఎంపీగారి భామ్మర్ధి అయినా సరే. ఈ రూల్‌ ఎప్పట్నుంచో ఉంది. కానీ ఏం లాభం? ప్రజాస్వామ్యంలో రూల్స్‌ ఎవరు పాటిస్తున్నారు? మూగ ప్రాణాల గురించి ఆలోచించేంతట మంచి మనసు ఎవరికి ఉంది?

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే.. మూగ జీవాల్ని చంపే వాడిని పట్టిస్తే రూ.25000 బహుమానం ప్రకటించింది పెటా. నిన్నటిరోజున హైదరాబాద్‌ వికారాబాద్‌ పరిసరాల్లోని ఓ థియేటర్‌ ముందు ప్రభాస్‌ వీరాభిమానులు ఓ మేకను తోలుకొచ్చి దారుణంగా నరికి పండగ చేసుకున్నారు. ఈ ఉదంతంపై పెద్ద రేంజులో నిరసనలు వెల్లువెత్తాయి. బాహుబలిలో అంత భీకర యుద్ధం ఉన్నా ఎక్కడా మూగ ప్రాణులకు హాని కలిగించలేదు. అన్నీ గ్రాఫిక్స్‌ లోనే తయారు చేశారు. కానీ అభిమానులు ఇలా చేయడం ఏం బాలేదని విమర్శలొచ్చాయి. పబ్లిక్‌ లో అంత క్రూరంగా ఓ జంతువును చంపడం తగదని హితవు పలికారు.

ఇలా బహిరంగంగా మూగజీవాల్ని హింసించి చంపేవాళ్లను పట్టిస్తే వారికి రూ.25వేలు బహుమానం అంటూ పెటా ప్రకటించింది. క్రూరత్వం నుంచి రక్షణ పేరుతో 2001లో జంతుసంరక్షణ చట్టాన్ని చేశారు. అది అమలవుతున్న తీరు అపహాస్యం అవుతోందిలా. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండానే పెటా ఈ నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News