సూపర్ స్టార్ రజనీకాంత్ సంక్రాంతి సీజన్లో 'పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రివ్యూస్.. మౌత్ టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ సంక్రాంతి సినిమాల పోటీలో నిలబడలేకపోయింది. రీసెంట్ గా ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 6 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ తో సరిపెట్టుకుంది.
ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 10 కోట్లకు కొనడం జరిగింది కాబట్టి ఓవరాల్ గా 40% నష్టాలతో డిజాస్టర్ గా నిల్చినట్టే. ఒకవేళ 'పేట'ను సంక్రాంతి సీజన్లో భారీ పోటీనడుమ రిలీజ్ చేయకుండా వేరే డేట్ లో విడుదల చేసి ఉంటే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉండేదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. '2.0' తెలుగులో నష్టాలు మిగిల్చినప్పటికీ భారీ కలెక్షన్స్ సాధించింది. అలాంటి సినిమా తర్వాత విడుదలైన రజనీ సినిమా పది కోట్లు కూడా రికవర్ చేయలేకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే అంశమే.
తెలుగు రాష్ట్రాల్లో 'పేట' క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 2.36 cr
సీడెడ్: 0.81 cr
ఉత్తరాంధ్ర: 0.74 cr
కృష్ణ: 0.58 cr
గుంటూరు: 0.52 cr
ఈస్ట్ : 0.49 cr
వెస్ట్: 0.32 cr
నెల్లూరు: 0.15 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 5.97 cr