తానేం మాట్లాడినా.. ఏం చేసినా.. తన సినిమాల పబ్లిసిటీ కోసమే అంటుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఐతే వర్మ కొత్త సినిమా కిల్లింగ్ వీరప్పన్ కు ఆయన కోరుకోకుండానే కావాల్సినంత పబ్లిసిటీ వస్తోంది. ఇప్పటికే వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి గొడవతో సినిమాకు మంచి ప్రచారం లభించింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనూ మాంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టే పరిణామాలు జరుగుతున్నాయి.
తమిళనాడుకు చెందిన పన్నీర్ సెల్వి అనే అడ్వకేట్ ఈ సినిమా విడుదల ఆపేయాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కిల్లింగ్ వీరప్పన్ సినిమా మొత్తం తప్పుల తడక అని.. ఇందులో కర్ణాటక పోలీసుల్నే హీరోలుగా చూపించారని.. తమిళనాడు పోలీసుల్ని ప్రభుత్వాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయని.. అందుకే సినిమా విడుదలను ఆపి వేస్తూ మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. కానీ మద్రాస్ హైకోర్టు అందుకు ఒప్పుకోలేదు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఈ కేసు వల్ల వర్మ సినిమాకు ఏ విధంగానూ నష్టం జరక్కపోగా.. విడుదలకు ముందు పబ్లిసిటీకి ఉపయోగపడుతోంది.ఓ పక్క వర్మ ట్విట్టర్లో తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తుంటే.. మరోవైపు కన్నడనాట, తెలుగు రాష్ట్రాల్లో టీవీల్లోనూ బాగా పబ్లిసిటీ దక్కుతోంది. జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.