ఫోటో స్టోరీ: వార్ భామ గ్లామర్ వార్

Update: 2020-01-23 05:46 GMT
బాలీవుడ్ లోని హాటెస్ట్ బ్యూటీలలో వాణి కపూర్ ఒకరు. బోల్డ్ అనే పదానికి వాణి పర్మనెంట్ అడ్రెస్. ఈ భామకు మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు కానీ 'వార్' విజయంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్ -టైగర్ ష్రాఫ్ లు హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. సాధారణంగానే సోషల్ మీడియా వీణను మీటడంలో వాణి స్పెషలిస్టు. 'వార్' సినిమా విజయంతో మరింతగా రెచ్చిపోతూ నెటిజన్ల హృదయాలపై వార్ ప్రకటించింది.

రీసెంట్ గా వాణి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. "మంచి శ్లేషతో ఈ ఫోటోకు ఈ క్యాప్షన్ ఇవ్వాలనుకున్నా కానీ కుదరలేదు" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. అయినా హాటు భామ పోస్ట్ చేసే ఫోటో ముఖ్యంగానీ కామెంట్ ముఖ్యమా? ఆ కామెంట్లు నెటిజన్లే పెట్టుకుంటారు కదా. ఈ ఫోటోలో వాణి బ్లూ కలర్ ఫ్రిల్స్ టాప్ బ్లాక్ కలర్ మిడ్డీ ధరించి ఓ కుర్చీలో సూపర్ హాట్ గా కూర్చుంది. ఆ స్టైలు.. మొహంలో ఆ చిలిపిదనం చూస్తుంటే నెటిజన్లు మాయలో పడకుండా ఉండలేరు.

ఈ ఫోటోకు సూపర్ కామెంట్స్ వచ్చాయి. "హాట్ క్యూట్ ప్రెట్టి".. "కిల్లర్ బ్యూటీ".. "సెక్సీ లెగ్స్" అంటూ కామెంట్లు పెట్టారు. అయినా ఆ కాళ్ళను చూస్తే ఎవరైనా 'సామజవరగమన' పాటేసుకోవాల్సిందే. ఇక వాణి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'షంషేరా' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Tags:    

Similar News