ఫోటో స్టోరి: పింకులో ఒంపుల్ సొంపుల్

Update: 2020-04-01 15:30 GMT
పింకులో సంపేత్తోందిగా.. ఎవ‌రీ ర‌స‌గుల్లా? అంటే.. ప‌రిచ‌యం అవ‌స‌ర‌మే లేదు. అందాల ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల ఫిట్ బాడీతో ఉర‌క‌లెత్తిస్తోంది. బొద్దందాన్ని షేప‌ప్ చేసి నైస్ గా క‌నిపిస్తోంది. అప్ప‌ట్లో కాస్త తీగ‌లాగా వేలాడిపోయినా.. కొంచెం వెయిట్ ని బ్యాలెన్స్ చేస్తూ కొంగొత్త రూపంతో న‌వ‌న‌వ‌లాడుతోంది. ప‌నిలో ప‌నిగా త‌న‌లోని న‌వ‌న‌వ‌ల్ని ఎర‌వేస్తూ  ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.

గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ క‌నిక‌రం లేకుండా వెలేసింది. హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ అయినా క‌నిక‌రిస్తుందా? అంటే అంతంత మాత్ర‌మే. ఆ క్ర‌మంలోనే అంత‌గా ప్రాధాన్య‌త లేని గ్లామ‌ర్ వేషాలకు సైతం బాలీవుడ్ లో అంగీక‌రించేస్తోంది. పైగా ముదురు హీరోలకు సై అనేస్తుండ‌డంతో అవ‌కాశాలు ఏవో అలా వ‌చ్చి ప‌డుతున్నాయి. అజ‌య్ దేవ‌గ‌న్.. జాన్ అబ్ర‌హాం లాంటి హీరోలు ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు ఇచ్చారు. ఇక‌పోతే ఇంత‌కు ముందు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా లాంటి యంగ్ బ్యాచిల‌ర్ హీరో అవ‌కాశం ఇచ్చినా ఏమంత క‌లిసి రాలేదు. దాంతో కుర్రహీరోలంతా ఈ అమ్మ‌డిని ఐరెన్ లెగ్ గానే భావిస్తున్నార‌ట‌.

అందుకే అన్ని క్రైసిస్ ల‌కు చెక్ పెట్టేసేందుకు ర‌కుల్ చాలా సీరియ‌స్ గా సోష‌ల్ మీడియాలో వ‌ల‌లు వేస్తోంది. అక్క‌డ వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. బికినీ.. టూపీస్.. స్విమ్ సూట్ కాదేదీ షూట్ క‌న‌ర్హం అన్న చందంగా రెగ్యుల్ గా ఫోటోల్ని షేర్ చేస్తోంది. ఇక వ‌ర్క‌వుట్ల వీడియోలు ఫోటోల‌కు అయితే కొద‌వేలేదు. తాజాగా పింక్ సూట్ ఫోటోల‌తో మ‌రోమారు క‌ల్లోలం సృష్టించింది. వాలుగా.. ఏట‌వాలుగా.. 90 డిగ్రీలు.. 180 డిగ్రీల కోణంలో ర‌క‌ర‌కాల భంగిమ‌లు ప్ర‌ద‌ర్శించి అగ్గి రాజేసింది. అస‌లే స‌మ్మ‌ర్ క‌ల్లోలం అందులో క‌రోనా ముస‌లం.. వెర‌సి ర‌కుల్ ఇలా చేయ‌డం ఏం బాలేదంటూ యూత్ అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. కుర్రాళ్లు రాజుకుపోతున్నారు. ఎంత పింక్ సూట్ అయినా మ‌రీ ఇంత దోర‌గా అందాల్ని వ‌డ్డించాలా? అంటూ ఐసైపోతున్నారంతే!!  బాలీవుడ్ లో  ఎటాక్ .. కోలీవుడ్ లో భార‌తీయుడు 2 చిత్రాల్లో ర‌కుల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News