నటి రిచా చద్దా సోషల్ మీడియా ట్రెండ్ లో వరుస ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా ఈ బ్యూటీ త్రోబ్యాక్ ఫోటో ఒకటి అంతర్జాలంలో హీట్ పుట్టిస్తోంది. రిచా ఈ ఫోటోగ్రాఫ్ లో పర్ఫెక్ట్ టోన్డ్ లుక్ లో కనిపిస్తోంది. బ్లాక్ షిమ్మరీ టాప్ ధరించిన రిచా అలా ఆదమరిచి రెప్ప వాల్చినప్పటి దృశ్యాన్ని కెమెరా క్యాప్చుర్ చేసింది. గాలికి ఎగిరే ఆ ముంగురులు రిచా ముఖంపై పడుతుంటే ఆ లుక్ సంథింగ్ స్పెషల్ గా ఉందంటూ నెటిజనులు పొగిడేస్తున్నారు. రిచా టూ హాట్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
రిచా చద్దా కెరీర్ జర్నీని పరిశీలిస్తే.. ఈ భామ బాలీవుడ్ లో బిజీ నటి. కెరీర్ ఆరంభమే ఫుక్రే సిరీస్ లో రిచా నటనకు చక్కని గుర్తింపు దక్కింది. ఓయే లక్కీ అనే కామెడీ చిత్రంతో చిన్న పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ 'లక్కీ ఓయ్!' అనే చిత్రంలోనూ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2008లో చాలా సినిమాల్లో సహాయ నటిగా కనిపించింది.
18 డిసెంబర్ 1986న పంజాబ్ - అమృత్ సర్ లో రిచా జన్మించింది. రిచా తండ్రికి ఒక మేనేజ్ మెంట్ సంస్థ ఉంది. ఆమె తల్లి డాక్టర్. కుసుమ్ లతా చద్దా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని PGDAV కాలేజీలో రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ గా పని చేసారు. కుసుమ్ రెండు పుస్తకాలను కూడా రచించారు. అంతేకాదు ఆమె గాంధీతో కలిసి పనిచేశారు. చద్దా ఢిల్లీలో పెరిగారు. 2002లో సర్దార్ పటేల్ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసింది. చద్దాకు ఏడాదిన్నర వయస్సు ఉన్నప్పుడు తన కుటుంబం ఢిల్లీకి వెళ్లింది.
రిచా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనలోని ఆధ్యాత్మికతను సైంటిఫిక్ భావజాలాన్ని కూడా వివరించింది. రిచా మాట్లాడుతూ..''నేను చాలా ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తిని. నేను శక్తిని.. ఒక రకంగా దేవుడిని నమ్ముతాను.సైన్స్ ఇంకా ప్రతిదానిని వివరించగలదని నేను అనుకోను. కానీ సైన్స్ గొప్పది'' అని అన్నారు. క్యాపిటల్ సిటీ దిల్లీలో ఎదగడం తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. చద్దా నలుగురు సోదరులతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు.. ఎల్లప్పుడూ ఆమెకు చాలా స్వేచ్ఛను ఇచ్చారు. సినీ నటి కావాలనే తన ఆకాంక్షను నెరవేర్చేందుకు తన తండ్రి గారు ఎంతో అండగా నిలిచారు. ఐదేళ్ల వయులోనే నటిని అవ్వాలనుకున్నాను. నా కుటుంబాన్ని నవ్వించేలా నటిస్తూ నేను నిజంగా ఆనందించాను అని రిచా ఇంటర్వ్యూలో తెలిపారు.
రిచా గత కొంతకాలంగా బాలీవుడ్ లో పాపులారిటీని పెంచుకుంది. తన అద్భుతమైన నటన .. విలక్షణమైన శైలితో పాపులరైంది. ఓయే లక్కీ- లక్కీ ఓయ్ (2008)- గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్- గోలియోన్ కి రాస్ లీలా రామ్ లీలా- మసాన్ సహా పలు చిత్రాలలో సహాయక పాత్రల్లో గొప్ప ప్రదర్శనలతో ఆకట్టుకుంది. తన నటనకు అనేక అవార్డులను కూడా అందుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె ఒక సినిమా స్టాండింగ్ ఒవేషన్ ను అందుకుంది.
ఎంపికలు చాలా కీలకం. అవకాశం వస్తే నో చెప్పడం ఎప్పుడూ సులభం కాదు. అయితే చద్దా తన దారిలో వచ్చిన ఏదైనా వైవిధ్యమైన అవకాశాన్ని కాదనుకోలేదు. ''నో చెప్పడం కష్టం.. ఎందుకంటే డబ్బుకు నో చెప్పడం ఎప్పుడూ కష్టమే''అని కూడా రిచా అంటుంది. సరదాగా అనిపించే పాత్రలు ఏవైనా చేయాలని కోరుకుంటుంది. ఇటీవల రిచా ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. తాజాగా టోన్డ్ బాడీతో గుబులు రేపుతున్న ఫోటోషూట్ వైరల్ అయ్యింది.