ఫోటో స్టోరి: స‌్నేహితుడే భ‌ర్త అయితే ఆ రొమాన్సే వేరు

Update: 2020-12-13 14:30 GMT
చంద‌మామ కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును ఈ ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిన‌దే. కుటుంబీకులు కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వివాహం జ‌రిగింది.

వివాహానంత‌రం మాల్దీవుల్లో హ‌నీమూన్ కి సంబంధించిన ఫోటోల్ని కాజ‌ల్ షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. ఇక హ‌బ్బీ కిచ్లుతో కాజ‌ల్ ఎంతో అన్యోన్యంగా రొమాంటిక్ గా ఉన్న ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళ్లాయి. తాజాగా ఈ సిరీస్ లో అద్భుత‌మైన కొన్ని ఫోటోల్ని కాజ‌ల్ షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

అలాగే ఈ రోజు కాజ‌ల్ అత్త గారి బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న‌కు ఒక అందమైన పుట్టినరోజు నోట్ రాశారు. గౌతమ్ కిచ్లుతో ఆమె పెళ్లి నుండి కొన్ని హృదయపూర్వక ఫోటోలను కూడా పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పంచుకుంటూ, ``నా జీవితంలో మీరు ఉన్నందుకు కృత‌జ్ఞ‌త‌లు. పుట్టినరోజు శుభాకాంక్షలు!`` అని కాజ‌ల్ తెలిపారు.

కాజల్ గౌతమ్ కిచ్లు తల్లి చేతిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఆక‌ట్టుకుంది. మరొక ఫోటోలో వారి అనుబంధానికి సంబంధించిన ఫోజు ఆక‌ట్టుకుంది. కెరీర్ సంగ‌తి చూస్తే కాజ‌ల్ ప్ర‌స్తుతం మోస‌గాళ్లు.. భార‌తీయుడు 2 చిత్రాల్లో న‌టిస్తోంది. చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య,.. దుల్కర్ సల్మాన్ స‌ర‌స‌న `హే సినమికా` చిత్రాల్లో న‌టిస్తోంది.
Tags:    

Similar News