ఫొటోటాక్‌ : కేజీఎఫ్‌ స్టార్‌ భార్య శ్రీమంతం

Update: 2019-10-19 09:49 GMT
కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా ఆల్‌ ఇండియా క్రేజ్‌ ను దక్కించుకున్న హీరో యష్‌. ప్రస్తుతం యష్‌ 'కేజీఎఫ్‌ 2' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ యంగ్‌ హీరో తన అయిరాను సోషల్‌ మీడియా ద్వారా పరిచయం చేశాడు. చాలా క్యూట్‌ గా ఉన్న అయిరా సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. యష్‌ భార్య రాధిక పండిట్‌ మరో సారి గర్బవతి అయ్యింది. రాధిక పండిట్‌ గర్బవతి అనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వచ్చాయి.

ఇటీవల ఆమెకు శ్రీమంతం జరిగింది. శ్రీమంతం ఫొటోను సోషల్‌ మీడియాలో రాధిక షేర్‌ చేసింది. స్నేహితులతో కలిసి ఉండి తన మొదటి పాప అయిరాతో రాధిక ఫొటోలో ఉంది. ఎల్లో డ్రస్‌ లో రాధిక చూడ్డాని చాలా అందంగా ఉంది. ఆమె తలకు ఒక పూల కిరీటం కూడా ఉండి ఆకర్షనీయంగా  మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

హీరోయిన్‌ గా ఎన్నో చిత్రాల్లో నటించిన రాధిక పండిట్‌ గర్బంతో ఉన్న సమయంలో కూడా నటించింది. ఈ ఏడాది ఈమె ఆదిలక్ష్మి పురాణ అనే చిత్రంలో నటించింది. జులై నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రంలో రాధిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Tags:    

Similar News