ఫోటో స్టోరీ: బొత్తాలు లేని ముంబై రత్తాలు!

Update: 2019-12-19 10:46 GMT
అందరూ ముంబైని ఆర్ధిక రాజధాని అంటుంటారు.. అది నిజమే కానీ ముంబై గ్లామర్ రాజధాని అని కూడా చెప్పుకోవాలి.  ఫ్యాషన్ కు కేరాఫ్ ఆడ్రెస్ గా ఉండడమే కాదు.. బాలీవుడ్ కు ఆడ్డా కూడా ముంబై.  అందుకే మన మన హీరోయిన్లు అందరూ అక్కడి నుంచి దిగుమతి అవుతుంటారు. ఇక ఇలాంటి ముంబైలో ఉంటూ సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని చెలరేగి పోతుంటారు కొందరు భామలు.  నేహ శర్మ కూడా ఆ బ్యాచే.

ఈ భామ సినిమాల పరంగా పెద్దగా సాధించింది ఏమీ లేదు.  దాదాపు డజను సినిమాల్లో నటించినా బ్రేక్ అయితే రాలేదు.  అందుకే ఇన్స్టాగ్రామ్ ను రఫ్ఫాడించే మిషన్ ను మొదలుపెట్టి అందులో విజయం సాధించింది.  రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ నెటిజన్ల మనసులను కొల్లగొడుతుంది. తాజాగా ఈ భామ మరోసారి అదే పని చేసింది. ఈ భామ ప్రస్తుతం ఎక్కడో ఒక బీచ్ లొకేషన్లో సరదాగా గడుపుతోంది. ఆ సంగతి మనకు తెలియాలి కదా? అందుకే ఆ ప్రదేశం నుండి ఒక ఘాటు ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "నా చొక్కాకు కొంచెం తినిపించాను" అని క్యాప్షన్ ఇచ్చింది.   అంటే ఏదో తినే సమయంలో తన చొక్కాపై మరక పడింది.  ఆ మరక ఎక్కడ ఉందో మీరు తీక్షణంగా చూసి గుర్తించండి.  ఇక ఫోటోలో వైట్ షర్టు బటన్లు పెట్టుకోకుండా అంతః సౌందర్యాన్ని పూర్తిగా ధారబోసింది.. పైగా తల వంచుకుని ఓ చిలిపి నవ్వు కూడా రువ్వింది.

ఇలాంటి ఫోటోలకు ఘాటు కామెంట్లు వస్తాయి కదా.. వచ్చాయి.  "సూపర్ హాట్".. "నేహ.. క్యా బాత్ హై".. "మాయలో పడేస్తున్నావ్".. అంటూ కొందరు స్పందించారు.  ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'తానాజీ'..  'తైష్' సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండూ సినిమాలే కాకుండా 'ఇక్ సాంధు హుండా సి' అనే పంజాబీ సినిమాలో కూడా నటిస్తోంది.
Tags:    

Similar News