గూఢ‌చారి గాళ్ మిస‌మిస‌ల వ‌ల‌లు

Update: 2019-12-05 06:52 GMT
జేమ్స్ బాండ్ సిరీస్ సీక్రెట్ ఏజెంట్ లా.. సూదంటు రాయిలా ఉంది ఎవ‌రీ అమ్మ‌డు? అంటారా.. ఇంకెవ‌రు తెలుగ‌మ్మాయ్ శోభిత ధూళిపాల‌. ఈ తెనాల‌మ్మాయ్ ట్యాలెంట్ విశ్వ‌ వ్యాప్తం అవుతోంది. ప్ర‌స్తుతం శోభిత ఓ హిందీ వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గూఢ‌చారి త‌ర్వాత తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చినా ఎంతో సెల‌క్టివ్ గా ఉంటున్న ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం అటు హిందీ ప‌రిశ్ర‌మ స్నేహాల‌పైనా అక్క‌డ కెరీర్ పైనా దృష్టి సారిస్తోంది. ఆ క్ర‌మంలోనే వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.

ఈ మాజీ మిస్ ట్యాలెంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తాజాగా ఫెమీనా వెడ్డింగ్ టైమ్స్ పోటోషూట్ తో మారోసారి కాక‌లు పుట్టిస్తోంది. ఈసారి పింక్ మిక్స్ చేసిన మ‌ల్టీక‌ల‌ర్డ్ మెటాలిక్ ఛ‌మ్మీల డ్రెస్ లో త‌ళ‌త‌ళా మెరిసింది. ఆ కురుల‌ను అలా ముఖం పై స్వేచ్ఛ‌గా వ‌దిలేసిన శోభిత సంథింగ్ హాట్ అప్పీల్ తో క‌నిపిస్తోంది. ఇక హాఫ్ షోల్డ‌ర్ డిజైన్ ఆ అమాయ‌క‌పు ముఖార‌విందంలో అందాన్ని మ‌రింత‌గా ఎలివేట్ చేసింది. శోభిత ఒంపుసొంపుల క్లీవేజ్ షో ప్ర‌త్యేకంగా కుర్రాళ్ల‌లో హాట్ టాపిక్ గా మారింది. ఆ మెడ‌లో పెండెంట్ నెక్లెస్.. వేలికి ఉంగ‌రం ఎంతో డీసెంట్ లుక్ ని ఇచ్చాయి.

ఇక‌పోతే తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో గూఢ‌చారి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ఆ త‌ర్వాత ఎందుక‌నో ఇక్క‌డ కెరీర్ ని ఎక్స్ టెంట్ చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్స‌య్యింద‌నే చెప్పాలి. అన్న‌ట్టు అడివి శేష్ గూఢ‌చారి సీక్వెల్ ని 2020 లో ప్రారంభించే ప్లాన్ లో ఉన్నాడు. అందులో శోభిత‌కు ఛాన్సుంటుందా లేదా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News