ఫోటో స్టోరీ : సీతామహాలక్ష్మి సంక్రాంతి సొగసులు..!

Update: 2023-01-16 12:30 GMT
సీతారామం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సీతామహాలక్ష్మి అదేనండి మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ సీరియల్స్ తో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా మారింది. బాలీవుడ్ లో సూపర్ 60 సినిమాలో నటించినా సరే తెలుగులో చేసిన సీతారామం సినిమాకే అమ్మడికి ఎక్కువ పాపులారిటీ తెచ్చింది. సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

అందుకే ఇక్కడ వెంట వెంట ఛాన్స్ లు అందుకుంటుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమాలో మృణాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. నాని నటించిన జెర్సీ సినిమా బాలీవుడ్ రీమేక్ లో మృణాల్ నటించింది. తెలుగులో ఆమెకు సీతా రామం తో స్టార్ ఇమేజ్ వచ్చింది. అందుకే దర్శక నిర్మాతలంతా కూడా ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక సంక్రాంతి సందర్భంగా మృణాల్ ఠాకూర్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి స్పెషల్ విషెస్ అందించింది. తన ఇన్ స్టాగ్రాం లో ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది మృణాల్ ఠాకూర్. గోల్డ్ కలర్ డ్రెస్ లో బంగారంలా మెరిసిపోతుంది మృణాల్ ఠాకూర్. తనకు ఉన్న 7.5 మిలియన్ ఫాలోవర్స్ కు తన ప్రతి అప్డేట్ ని.. తన రకరకాల ఫోటో షూట్స్ తో అలరిస్తున్న మృణాల్ రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటుంది.

నాని సినిమాలో కూడా ఆమెది చాలా స్పెషల్ రోల్ అని తెలుస్తుంది. నాని ఈ సినిమా కోసం యూత్ లుక్ ని ట్రై చేస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే సీతా రామం తర్వాత మృణాల్ కి ఇది మరో లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. నటనా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాబట్టి మృణాల్ కి ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News