అతిలోక సుందరి శ్రీదేవి సోదరిగా సినీ రంగ ప్రవేశం చేసిన ముద్దుగుమ్మ మహేశ్వరి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. హీరోయిన్ గా ఈమె నటించిన సినిమాలు ఆమెను అక్క నీడ నుండి చాలా తక్కువ సమయంలోనే బయట పడేలా చేశాయి అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా మహేశ్వరి చేసిన సినిమాలు తక్కువే అయినా దక్కిన గుర్తింపు ఎక్కువే.
ఈ మధ్య కాలంలో మహేశ్వరి ని చూసిందే లేదు. చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె కనీసం మీడియాలో కూడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉండరు. కానీ తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫొటోల కారణంగా మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందో క్లారిటీ వచ్చింది.
తన ఆంటీ అంటూ జాన్వీ కపూర్ ఆ మధ్య తన ఇల్లును చూపించే సమయంలో మహేశ్వరి ని పరిచయం చేసింది. ఆ సమయంలో సరిగా మహేశ్వరి కనిపించలేదు. కానీ తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫొటోల్లో మహేశ్వరి క్లీయర్ గా కనిపించింది. ఈ మె గులాబీ హీరోయినా అన్నట్లుగా నోరు తెరిచే విధంగా మహేశ్వరి మార్పు చెందింది.
మహేశ్వరి పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఎక్కువ బరువు అయితే పెరగలేదు.. కానీ ఫేస్ లో చాలా మార్పు వచ్చింది. గతంలో ఉన్న చార్మ్ ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని విధాలుగా కూడా మహేశ్వరి లో వచ్చిన మార్పును ఆమె అభిమానులు తీసుకోలేక పోతున్నారు.
సీనియర్ హీరోయిన్స్ చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. మరి మహేశ్వరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అనేది చూడాలి. జాన్వీ కపూర్ యొక్క సినిమాల బాధ్యతను మహేశ్వరి చూసుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.