ఫోటో స్టోరీ: బోల్డ్ థీమ్ లో పాయల్

Update: 2020-01-29 09:48 GMT
టాలీవుడ్ లో నటించిన తొలి సినిమా 'RX100' సెన్సేషనల్ హిట్ కావడంతో భారీగా గుర్తింపు సాధించింది పాయల్ రాజ్ పుత్. ఒకే సినిమాతో చాలామంది హీరోయిన్ల కు దక్కని గుర్తింపు దక్కించుకుంది. లిప్పులాకులతో చెలరేగిపోయి మరీ నటించడంతో బోల్డ్ హీరోయిన్ టాగ్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి. అయితే వీటిలో 'వెంకీమామ' తప్ప పాయల్ కు మరో హిట్ దక్కలేదు. ప్రస్తుతం పాయల్ కెరీర్ నెమ్మదిగానే సాగుతోంది. కెరీర్ మెల్లగా సాగుతోంది కానీ సోషల్ మీడియా లో మాత్రం పాయల్ వేగం చాలా ఎక్కువే.

హాట్ ఫోటో షూట్లు చెయ్యడం అనేది పాయల్ కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా మరోసారి ఒక ఫోటోషూట్ లో పాల్గొంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ చందు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫోటో షూట్లో బ్లాక్ థీమ్ లో ఫోటోలకు పోజిచ్చింది. థై స్లిట్ ఉండే బ్లాక్ గౌన్ ధరించి ఒక సూపర్ పోజిచ్చింది. హెయిర్ స్టైల్ అందంగా ఉంది.. అంతే కాకుండా బ్లాక్ లిప్ స్టిక్ తో విభిన్నంగా కనిపిస్తోంది. పాయల్ కు తన మొదటి సినిమా నుంచి బోల్డ్ ఇమేజ్ ఉంది. ఈ ఫోటోలో కూడా అదే బోల్డ్ నెస్ కనిపిస్తోంది.

పాయల్ నటించిన 'డిస్కోరాజా' ఈ మధ్యే రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'ఏంజెల్' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పాయల్ కు తమిళం లో మొదటి సినిమా. తెలుగులో కూడా ఒక బోల్డ్ సినిమా సైన్ చేసిందని టాక్ ఉంది.
Tags:    

Similar News