ఎర్ర కోక ర‌వికెలో జాన్వీ సింగారం

Update: 2022-10-16 01:30 GMT
జూ.అతిలోక సుంద‌రిగా వెలిగిపోతోంది జాన్వీ కపూర్. వ‌రుస సినిమాల‌తో ప్ర‌యోగాలు చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. శ్రీ‌దేవి వార‌సురాలిగా లెగ‌సీని ముందుకు న‌డిపిస్తోంది. దాంతో పాటే సామాజిక మాధ్య‌మాల్లో భారీ ఫాలోయింగ్ ని సంపాదిస్తోంది. బుధవారం నాడు తన త‌దుప‌రి చిత్రం మిలి టీజర్ ను జాన్వీ షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. మత్తుకుట్టి జేవియర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మిలి 2019లో విడుదలైన మలయాళ చిత్రం `హెలెన్‌`కి అధికారిక రీమేక్.

ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల్లో భాగంగా జాన్వీ వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో సునామీగా మారుతున్నాయి. ఇంత‌కుముందే జాన్వీ రెడ్ హాట్ శారీలో క‌నిపించి వేడెక్కించింది. ఎర్ర చీర కాంబినేష‌న్ ఎర్రటి ర‌వికెలో జాన్వీ టూ హాట్ గా క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. మ‌రోవైపు త‌న త‌దుప‌రి చిత్రం మిలీ ప్ర‌చారంలో జాన్వీ బిజీబిజీగా గ‌డిపేస్తోంది.

మిలీ చిత్రం సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కింది. అంద‌మైన మిలీ బ‌తుకు మనుగడ ప్రయాణం క్లిష్ఠ‌ ప‌రిస్థితుల్లో ఎలా సాగింది? అన్న‌ది పెద్ద తెర‌పై చూడాలి. ఆమె అనుకోని స‌న్నివేశంలో చిక్కుకుపోయి కోల్డ్ ఫ్రీజర్ నుండి కూడా తప్పించుకుంటుంది. ఇలాంటి ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చూడొచ్చు. టీజర్ లో జాన్వీ కపూర్ ఎలక్ట్రికల్ టేప్ ను కత్తిరించి దానితో చుట్టుకొని వణుకుతూ క‌నిపించింది.  విపరీతమైన చలిని త‌ట్టుకోలేక‌ జాన్వీ భ‌యంతో జ్వ‌ర‌ లక్షణాలతో బాధ‌ప‌డ‌డం కూడా టీజర్ లో చూపించారు. చలిని ఎలాగైనా ఎదుర్కోవటానికి ఆమె తన చేతులను రుద్దడం మంచు కొరికిన పాదాలను బిగించడం ప్ర‌తిదీ ఎమోష‌న్ ని ర‌గిలిస్తుంది.

టీజర్ లో జాన్వీ ఫ్రీజర్ లో నుండి బయటికి వెళ్లేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు క‌నిపిస్తుంది. మంచులో బిగుసుకుపోయిన‌ చేతులతో తలుపులను తీయ‌డానికి ప్రయత్నించడం అలాగే ఎవరైనా గమనించడానికి కొంత శబ్దం చేయడానికి తలుపుల‌పై స్టీల్ ప్లేట్ ను కొట్టడం చూడవచ్చు. టీజర్ చివరలో జాన్వీ టేప్ లో చుట్టిన‌ లోహపు కడ్డీని పట్టుకుని తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంది.

చాలా మంది అభిమానులు అలాగే పరిశ్రమకు చెందిన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు జాన్వీ పోస్ట్ కి స్పందిస్తూ ఈ లింక్ ని విప‌రీతంగా షేర్ చేసారు.  జాన్వీ మామ సంజయ్ కపూర్ హార్ట్ ఈమోజీని షేర్ చేసి చప్పట్లు కొడుతూ టీజర్ అద్భుతంగా ఉందని ప్ర‌శంసించాడు.

చాలా మంది అభిమానులు జాన్వీ న‌ట‌న‌పై ప్రేమ కురిపించి మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ టీజర్ చూసిన తర్వాత ఇది మంచి సినిమా అవుతుందని అంచనా వేశారు. మరొక వినియోగదారు టీజర్ ఆసక్తికరంగా ఉందని మద్దతునిచ్చాడు. మిలి నవంబర్ 4 న  విడుద‌ల కానుంది. కుమార్తె జాన్వి తో క‌లిసి తండ్రి బోనీ కపూర్ ఒక నిర్మాణంలో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. జాన్వీతో కలిసి మనోజ్ పహ్వా - సన్నీ కౌశల్ ఈ సర్వైవల్ థ్రిల్లర్ లో నటించారు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News