RRR నిర్మాతల తాజా నిర్ణయంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు సీరియస్ గా ఉన్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి బరిలో రావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వాయిదా వేయించడానికి కారణం ఆర్.ఆర్.ఆర్. తొలుత సంక్రాంతి బరిలోనే తమ సినిమా రిలీజవుతుందని ప్రకటించిన భీమ్లానాయక్ నిర్మాత నాగవంశీ సైతం తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చినందుకు పవన్ ఫ్యాన్స్ కి సారీ చెప్పారు.
మా హీరోగారు కోరడంతోనే అలా చేస్తున్నాం. అందుకు మమ్మల్ని క్షమించండి. శివరాత్రి కానుకగా భీమ్లా నాయక్ ని ఫిబ్రవరి 25న విడుదల చేస్తాం. అప్పుడు నిరాశపరచం! అంటూ ప్రకటించారు. అందుకు తగ్గట్టే భీమ్లాని షెడ్యూలింగ్ చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నామని నిర్మాత దానయ్య - దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. దీంతో పీకే ఫ్యాన్స్ ఒక్కసారిగా భగ్గుమన్నారు.
ఊహించని పిడుగులా మీద పడుతున్న ఒమిక్రాన్ టెన్షన్స్ వల్ల ఉత్తరాది-దక్షిణాది అన్నిచోట్లా అన్ని రాష్ట్రాల్లో 50శాతం ఆక్యుపెన్సీ నియమాన్ని తెరపైకి తేవడంతో ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నైట్ కర్ఫ్యూలు కోవిడ్ ప్రోటోకాల్ అంటూ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చే సన్నివేశం కనుమరుగవుతుండడంతో ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ తమ సినిమాని సంక్రాంతి బరి నుంచి వాయిదా వేయించినందుకు ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ పై పవన్ ఫ్యాన్స్ గుర్రుమీదున్నారు. పవన్ మూవీతో పాటు మహేష్ సర్కార్ వారి పాట.. వెంకీ-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ఎఫ్ 3ని కూడా వాయిదా వేయించిన ఘనత ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ దే. ఇంత చేశాక ఇప్పుడు మళ్లీ పోస్ట్ పోన్ అంటూ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ప్లేట్ ఫిరాయించారని ఫ్యాన్స్ ఆగ్రహం చెందుతున్నారు. సంక్రాంతి వినోదం అంతా చప్పగా మారిపోయిందని పీకే ఫ్యాన్స్ తో పాటు ఆయా హీరోల అభిమానులు సీరియస్ గా ఉన్నారు. మరి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఏం ఉండదు. ఇప్పుడు భీమ్లా నాయక్ డేట్ ని ముందుకు తేవడం కుదరదన్నది అందరికీ తెలిసినదే. ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో ఈ వ్యవహారంపై ట్రోలింగ్ నడుస్తోంది.