మహేష్ కి నార్త్ లో అంత క్రేజా?

Update: 2016-03-11 08:50 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం షూటింగ్ తుది దశకు చేరుకుంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాల కోసం బ్రహ్మోత్సవం యూనిట్ ప్రస్తుతం ఉత్తరాది పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతోంది. తాజాగా హరిద్వార్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు కాశీకి పయనమైంది. హరిద్వార్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో మహేష్ బాబు అండ్ టీం కి చుక్కలు కనిపించాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

శివరాత్రి సందర్భంగా హరిద్వార్ లోని ఘాట్లతో పాటు పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఇదే సమయంలో బ్రహ్మోత్సవంకి సంబంధించిన కొన్ని సీన్లను కూడా చిత్రీకరించారు. అయితే.. షూటింగ్ సమయంలో విపరీతంగా రద్దీ ఉండడంతో.. యూనిట్ ఇబ్బందులు ఎదుర్కుంది. దీనితో పాటు మహేష్ బాబును గుర్తు పట్టిన అభిమానులు.. విపరీతంగా షూటింగ్ స్పాట్ కు చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. దీంతో యూనిట్ మొత్తం ఇబ్బందులు పడాల్సి వచ్చిందట. చివరకు స్థానిక పోలీసుల సహాంయం తీసుకుని పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చారని తెలుస్తోంది.

హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రంలో సౌత్ నుంచి వెళ్లిన భక్తులు కూడా ఉంటారు కానీ.. మరీ ఆ ప్రాంతంలో మరీ ఇంతగా మహేష్ ని కలవడం కోసం ఫ్యాన్స్ ఆరాటపడ్డం ఆశ్చర్యం కలిగించే విషయమే. నార్త్ లో కూడా టాలీవుడ్ ప్రిన్స్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో ఈ సిట్యుయేషన్ ప్రూవ్ చేస్తోంది.
Tags:    

Similar News