ఇప్పుడు డ్రగ్స్ కేసుకు సంబంధించి మరో రెండు రోజుల్లో ఎక్సయిజ్ శాఖ విచారణ మొదలుపెట్టనుంది. ఇదే విషయంలో గతంలో మాట్లాడిన ఎక్సయిజ్ శాఖ డైరక్టర్ అకున్ సబర్వాల్.. ఖచ్చితంగా నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు అందరూ కూడా వారికి సూచించిన తేదీల్లో పర్సనల్ గా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. లాయర్ ను పంపుతా అంటే కుదరదని కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఇప్పుడు ముమాయత్ ఖాన్ మ్యాటర్ చాలా కన్ఫ్యూజింగ్ గా మారింది.
మొన్న ఒక రోజులన డ్రగ్స్ గురించి చాలా పేర్లు మన టివిల్లో వస్తున్న వేళ.. రాకరాక హైదరాబాద్ వస్తే నాకు భలే వెల్కమ్ చెప్పారే అంటూ అమ్మడు సెటైర్ కూడా వేసింది. అయితే అప్పుడు ఆమెకు డ్రగ్స్ కేసుకు సంబంధించి నోటీస్ అందిందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఇంతవరకు పోలీసులకు ముమాయత్ హైదరాబాద్ అడ్రస్ కాని.. ముంబయ్ అడ్రస్ కాని సరిగ్గా తెలియకపోవడంతో ఆమెకు నోటీస్ అందించలేదట. కాని ఇప్పుడు పూణె లోని ఒక ఇంటి సెట్లో బిగ్ బాస్ షూటింగులో ఉంది కాబట్టి.. అక్కడి వెళ్ళి పోలీసులు ఆమెకు నోటీస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ ఇచ్చినా కూడా.. బిగ్ బాస్ నియమనిబంధనల ప్రకారం.. ఆమెకు ఆ హౌస్ నుండి బయటకు వస్తే మాత్రం ఎలిమినేట్ అవ్వాల్సిందే. లేదంటే తాళం తీయరు. ఇప్పుడు ముమాయత్ ఎలా వస్తుంది?
ఆల్రెడీ లాయర్లను పంపిస్తే కుదరదని ఎక్సయిజ్ శాఖ చెప్పేసింది కాబట్టి.. ముమాయత్ స్వయంగా రావాల్సిందే. లేదంటే దేశాన్ని ఉద్దరించే గొప్ప ప్రోగ్రామ్ లో పాల్గొంటొంది కాబట్టి పోలీసులు ఆమెకు ఏదన్నా రిలాక్సేషన్ ఇవ్వాల్సిందే. అలా ఇస్తారా? ఒకవేళ బిగ్ బాస్ నిర్వాహకులు అడ్డుకుంటే.. ముమాయత్ ను బలవంతంగా తీసుకువెళ్ళడం కుదరదు. ఆమె బయటకు వచ్చాక అరెస్టు చేసి తీసుకెళ్ళాలి. చెప్పిన టైములో హాజరు కానివారిని అరెస్టు కూడా చేయొచ్చంటూ గతంలో ఆల్రెడీ చెప్పారు కూడా. చూద్దాం ఏమవుతుందో!!