నటిపై లైంగిక దాడి కేసులో కీలక ఆధారం?

Update: 2017-07-03 11:00 GMT
ఈ ఏడాది ఆరంభంలో ఓ మలయాళ స్టార్ హీరోయిన్ పై కిడ్నాప్.. లైంగిక దాడి జరగడం ఎంతటి సంచలనం రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ కేసులో నిందితులు వెంటనే పోలీసులకు చిక్కినా.. ఇంకా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. కిడ్నాప్ వెనుక అసలు సూత్రధారులెవరన్నది ఇప్పటిదాకా బయటికి రాలేదు. ముందు నుంచి ఈ ఘటన వెనుక సీనియర్ హీరో దిలీప్ ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే ఆయన్ని పోలీసులు విచారించారు కూడా. ఐతే తనకీ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటున్నాడు దిలీప్. హీరోయిన్ కిడ్నాప్ లో కీలకంగా వ్యవహరించిన పల్సర్ సుని ఈ కేసులో తన పేరు చెప్పకుండా ఉండేందుకు కోటిన్నర రూపాయలు డిమాండ్ చేసినట్లు కూడా ఆయన ఆరోపించాడు. ఐతే పోలీసులు ఇటీవల దిలీప్ ను 12 గంటల పాటు విచారించడంతో ఆయన పాత్రపై అనుమానాలు కమ్ముకున్నాయి.

మరోవైపు దిలీప్ కొన్ని నెలల కిందటే హీరోయిన్ కావ్యను రెండో పెళ్లి చేసుకోవడం తెలిసిన సంగతే. ఆమె పేరుతో నడిచే ఇ-కామర్స్ షాపులో భావన కేసుకు సంబంధించిన ఓ కీలక ఆధారం లభించినట్లుగా వార్తలొస్తున్నాయి. నటిని కిడ్నాప్ చేసి.. ఆమెపై అటాక్ చేసిన సమయంలో పల్సర్ సుని ఫొటోలు.. వీడియోలు తీసిన మొబైల్ ఏమైందన్నది తెలియకుండా పోయింది. ఆ మొబైల్ పోయిందని సుని పోలీసులతో చెప్పాడు.

కానీ వాళ్లు తమదైన శైలిలో ప్రశ్నించగా.. ఈ మొబైల్లో ఉన్న మెమొరీ కార్డును కావ్యకు ఇచ్చినట్లుగా ఒప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. పోలీసులు కావ్యకు సంబంధించిన ఇ-కామర్స్ షాపులో మూడు గంటల పాటు సోదాలు చేయగా.. ఈ మెమొరీ కార్డు దొరికినట్లుగా తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. నిజంగా ఆ మెమొరీ కార్డు కావ్య షాపులో ఉన్నట్లయితే ఈ కేసుతో దిలీప్-కావ్యలకు సంబంధమున్నట్లే భావించాలేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News