గడిచిన కొద్దిరోజులుగా బిగ్ బాస్ షో మీద వెలుగు చూసిన ఫిర్యాదుల సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో తొలుత తమను ఎంపిక చేసినట్లుగా చెప్పి.. తర్వాత కమిట్ మెంట్ అడిగారని.. తమ పై వారిని ఎలా సంతృప్తి పెడతారని ప్రశ్నించారని.. ఆ తర్వాత తమను షోలో సెలెక్ట్ కాలేదని చెప్పారంటూ ఆరోపణలు వెల్తువెత్తటం తెలిసిందే.
బిగ్ బాస్ షో మీద తొలి నుంచి పోరాడుతున్న శ్వేతారెడ్డి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా బంజారాహిల్స్ పోలీసులు ఈ రోజు (బుధవారం) ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో ఉన్న స్టార్ మా కార్యాలయంలోని ఆడ్మిన్ హెడ్ శ్రీధర్ కు నోటీఉలు అందజేశారు. బిగ్ బాస్ ఇన్ ఛార్జ్ శ్యాంతో పాటు రవికాంత్.. రఘు.. శశికాంత్ లపై శ్వేతారెడ్డి ఈ నెల 13న కంప్లైంట్ చేయటం తెలిసిందే.
ఈ ఫిర్యాదులపై వివరాలు సేకరించేందుకు స్టార్ మా కార్యాలయ ఆడ్మిన్ కు సీఆర్పీసీ 91.. 160 కింద నోటీసులు అందజేశారు. ఒప్పంద వ్యవహారం.. ఎంపికకు ఉన్న నిబంధనలు.. శ్యాంతో పాటు మిగిలిన ముగ్గురి పాత్ర మీద వివరాలు తమకు సమాధానం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఓవైపు బిగ్ బాస్ షో మొదలై.. హౌస్ మేట్స్ మధ్య రచ్చ మొదలై హాట్ హాట్ గా మారిన వేళలోనే.. బయట కూడా బిగ్ బాస్ మీద వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక అడుగు ముందుకేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.